Breaking News

Daily Archives: July 26, 2018

విద్యుత్‌ కార్మికుల సమ్మె – పలు సంఘాల మద్దతు

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డిలో గత ఆరురోజులుగా సమ్మె చేస్తున్న విద్యుత్‌ కాంటాక్టు ఉద్యోగుల సమ్మెకు పలు సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు వేరువేరుగా దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి తమ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంటాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలు చేయకపోవడం గర్హనీయమన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులను అరెస్టు చేయడం శిబిరాన్ని తొలగించడం హక్కుల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. ...

Read More »

విద్యుత్‌ కాంటాక్టు కార్మికుల అరెస్టులు అప్రజాస్వామికం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఆరురోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఎలక్ట్రికల్‌ కాంటాక్టు కార్మికులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎంసిపిఐ, ఏఐసిటియు నాయకులు పేర్కొన్నారు. గురువారం డిగ్రీ కళాశాల వద్ద విద్యుత్‌ కార్మికులతో కలిసి వారు మాట్లాడారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా సమ్మె చేస్తున్న ఎలక్ట్రికల్‌ కాంటాక్టు కార్మికులను పోలీసులు అరెస్టుచేయడం, సమ్మె శిబిరాన్ని తొలగించడం గర్హణీయమన్నారు. వారికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజలింగం, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కార్గిల్‌ వీర సైనికులకు నివాళులు

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్గిల్‌ యుద్దంలో వీర మరణం పొందిన భారత సైనికులకు గురువారం రాత్రి బిజెపి, బిజెవైఎం నాయకులు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించారు. జాతీయ రహదారిపై క్రొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్‌ యుద్దంలో వీరోచితంగా పోరాడి భారత సైనికులు పాకిస్తాన్‌పై విజయం సాధించారన్నారు. యుద్దంలో వీరమరనం పొందిన వారికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బిజెపి, బిజెవైఎం నాయకులు మోతె కృష్ణాగౌడ్‌, అరికెల ప్రభాకర్‌ యాదవ్‌, చింతల రమేశ్‌, జూలూరి ...

Read More »

సిసి కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక్క సిసి కెమెరా పదిమంది పోలీసులతో సమానమని సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకొని రక్షణ వలయాలు సృష్టించుకోవాలని కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో సిసి కెమెరాల ఏర్పాటు, దొంగతనాల నివారణపై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో, అన్ని వీధుల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. వాటివల్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టడమే గాకుండా, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకోవడంలో సిసి కెమెరాలు ...

Read More »

ఆసుపత్రి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంటాక్టు కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ఏఐసిటియు అనుబంధ సంస్థ తెలంగాణ మెడికల్‌ కాంటాక్టు ఎంప్లాయిస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు శానిటేషన్‌ ఉద్యోగులను సెక్యురిటి సిబ్బందిని క్రమబద్దీకరించాలని, వారికి ఆర్జిత సెలవులు ఇవ్వాలని కోరారు. ఇఎస్‌ఐ కార్డులు, పిఎప్‌ నెంబర్లు సమ పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

నాణ్యమైన సిసి టివి కెమెరాలు అందించాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో సిసి టివి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు నాణ్యమైనవి వినియోగదారులకు అందించాలని పోలీసు కమీషనర్‌ కార్తికేయ వ్యాపారస్తులను కోరారు. గురువారం కమీషనరేట్‌ కార్యాలయంలో సిసి కెమెరాల అమ్మకం దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యతగల సిసి కెమెరాలు ఏర్పాటుకు కృసి చేయాలని, అట్టి కెమెరాల వలన నేరాలు నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. నేరం జరిగిన చోట క్షుణ్ణంగా కనిపించే విధంగా కెమెరాలు ఏర్పాటు చేయాలని, ...

Read More »

మట్కా స్థావరంపై టాస్క్‌ఫోర్సు పోలీసుల దాడులు

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం అర్దరాత్రి టాస్క్‌ఫోర్సు పోలీసులు నిజాంకాలనీలో చవాన్‌ అలియాస్‌ చావల్‌ ఇంటిపై దాడిచేసి మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నట్టు సిఐ జగదీస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుని వద్దనుంచి రూ. 26 వేల 760 తోపాటు మట్కా చీటిలు స్వాదీనం చేసుకున్నట్టు సిఐ పేర్కొన్నారు. చవాన్‌పై గతంలో 5వ టౌన్‌లో మట్కా కేసు ఉందని, 2003 నుంచి మట్కా నిర్వహిస్తున్నాడని, ఉమ్రి బాబుతో కలిసి నిజామాబాద్‌లో మట్కా నెట్‌వర్క్‌ నడుపుతున్నాడని, ఉమ్రి ...

Read More »

కార్గిల్‌ అమరవీరులకు నివాళి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్గిల్‌ విజయదివస్‌ పురస్కరించుకొని హైమద్‌ బిఇడి, డిఇడి కళాశాలలో గురువారం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ బాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశ సమగ్రతకు, దేశాభివృద్దికి తమవంతుగా పాటుపడాలని కోరారు. దేశంలో అందరు స్వేచ్చగా ఉండడానికి కారణం దేశ సైనికులే అని కోరారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్‌, అనిఫ్‌ పాషా, స్వప్న, ఫైజల్‌, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

శక్తి యాప్‌ ద్వారా సభ్యత్వ నమోదు

రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల దృష్ట్యా దేశంలో కాంగ్రెస్‌పార్టీ ఆద్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి సంబందించి పూర్తి సమాచారం శక్తియాప్‌లో ఉంటుందని రెంజల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సాయారెడ్డి అన్నారు. మండలంలోని కందకుర్తి, పేపర్‌మిల్‌ గ్రామాల్లో గురువారం ఎంపిపి మోబిన్‌ఖాన్‌, జడ్పిటిసి నాగభూషణ్‌రెడ్డిలతో కలిసి ఆయన శక్తియాప్‌ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తేవడానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శక్తియాప్‌ ...

Read More »

కార్గిల్‌ అమరవీరులకు ఘన నివాళి

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్గిల్‌ విజయదివస్‌ సందర్భంగా బిజెపి నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం కార్గిల్‌ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోగల అమరవీరుల స్థూపం వద్ద బిజెపి నగర శాఖ ఆద్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌ మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలు లెక్కచేయకుండా అనునిత్యం సరిహద్దులో కాపలా ఉంటూ తమ జీవితాన్ని త్యాగం చేసే సైనికులకు మనమందరం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఆనాడు ...

Read More »

సైనికుల త్యాగం అమూల్యమైనది

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతసరిహద్దులను నిరంతరం రక్షిస్తున్న సైనికుల త్యాగం అమూల్యమైనదని బార్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌గౌడ్‌ అన్నారు. గురువారం నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో కార్గిల్‌ అమరవీరుల స్థూపం వద్ద బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన సైనికులు నేటి యువతరానికి ఆదర్శప్రాయులని, సైనికుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ...

Read More »

నగరంలో పోలీసుల నిర్బంద తనిఖీ

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున రెండోటౌన్‌ పరిధిలో పోలీసులు నిర్బంద తనిఖీ నిర్వహించారు. రెండో టౌన్‌ పరిధిలోని బురుడుగల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు నిర్బంద తనికీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమీషనర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు నిజామాబాద్‌లోని మిర్చికాంపౌండ్‌, చంద్రశేఖర్‌ కాలనీ, ఆర్మూర్‌, 3వ టౌన్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, నందిపేట్‌, నవీపేట, రెంజల్‌ పరిదిలో కార్టన్‌ సర్చ్‌ నిర్వహించడం జరిగిందని, ...

Read More »

నలుగురి బైండోవర్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాత నేరస్తులకు సంబంధించి నలుగురిని నిజామాబాద్‌ ఉత్తర మండలం తహసీల్దార్‌ ముందు గురువారం బైండోవర్‌ చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. వారిలో మార్పుకోసం ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

కారం రవీందర్‌రెడ్డికి ఘన సన్మానం

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకులు, ఉద్యోగ సంఘాల జేఏసి అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని గురువారం జిల్లా టీఎన్జీవోస్‌ బృందం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. రవీందర్‌రెడ్డికి ఇటీవలే కంకణాల జ్యోతిరాణి చారిటబుల్‌ ట్రస్టు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ స్ఫూర్తి, జ్యోతి రత్న అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకుగాను జిల్లా టీఎన్జీవోస్‌ నాయకులు కిషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వెళ్ళి రవీందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌ మాట్లాడుతూ రవీందర్‌రెడ్డి ఉద్యోగులందరికి మార్గదర్శకులని, ...

Read More »

రూరల్‌ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని బిజెపి రూరల్‌ ఇన్‌చార్జి గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్‌ నియోజకవర్గం చాలా వెనకబడి ఉందని ఈ ప్రాంతంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆయన ఆరోపించారు. నిజాంసాగర్‌ నీటిని రూరల్‌ నియోజకవర్గానికి అందకుండా శ్రీరాంసాగర్‌కు మళ్ళించి ఇక్కడి రైతులను, తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని అదేవిధంగా సింగూరు నీటిని ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలో జరుగుతున్న భూగర్భ మురికి కాలువలు, మిషన్‌ భగీరథ పనులపై సమీక్షించారు. అనంతరం ఎల్లమ్మగుట్టలో నిర్మిస్తున్న ఎస్‌పిపి-2 పనులను పరిశీలించారు. ఆగష్టు 1న రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌ రానున్న సందర్భంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నగరంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ళను ఎమ్మెల్యే ...

Read More »

పలు గ్రామాల్లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు గురువారం పలు గ్రామాల్లో పర్యటించి హరితహారంలో పాల్గొన్నారు. ధర్పల్లి మండలం ఎంపిడివో కార్యాలయంలో హరితహారంలో పాల్గొని మొక్కలునాటి నీరుపోశారు. అనంతరం తహసీల్‌ కార్యాలయంలో, ఓ రైతుకు చెందిన నాలుగెకరాల భూమిలో ఈత మొక్కలు నాటారు. ధర్పల్లి కెజిబివిలో, డిగ్రీ కళాశాలతో పాటు వివిధ విద్యాసంస్థల్లో కలెక్టర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హరితహారాన్ని బాధ్యతగా స్వీకరించి ఖాళీ స్థలాల్లో, దేవాలయాలు, చర్చిలు, ...

Read More »

ఇరిగేషన్‌ కార్యాలయంలో మొక్కలు నాటిన అధికారులు

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాధాకృస్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 4వ విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, మొక్కలు నాటడం ద్వారా గ్రీనరీ ఏర్పడి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, వాతావరణంలో సహజమైన మార్పులు చోటుచేసుకొని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా వాతావరణం సమతుల్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గైని గంగారాం, ...

Read More »

బిసి స్టడీ సర్కిల్‌ ఆద్వర్యంలో ఉచిత సివిల్స్‌ కోచింగ్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు టిపిపిఎస్‌సి నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్టు బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సువర్ణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ బిసి స్టడీ సర్కిల్‌లో ఉచితంగా కోచింగ్‌ ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 30 తేదీ నుంచి ఆగష్టు 12 లోపు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ...

Read More »

తాడ్‌బిలోలిలో విచారణ చేపట్టిన బోధన్‌ ఏసిపి

రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామాన్ని గురువారం బోదన్‌ ఏసిపి రఘు సందర్శించారు. జూలై 8న గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగిన విషయంలో బాధితురాలు ఫిర్యాదుచేశారు. విషయంపై బోధన్‌ ఏసిపి రఘు, స్తానిక ఎస్‌ఐ అంబర్యా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Read More »