Breaking News

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

నందిపేట రూరల్‌, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల సమావేశం శనివారం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌ కుమార్‌, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు ప్రతి గ్రామస్థాయిలో బూత్‌ కమిటీలు పటిష్టం చేయాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించిన 23 సూత్రాల ప్రకారం పార్టీ పటిష్టం చేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో కూడళ్ళ వద్ద ప్రధాని నరేంద్రమోడి ప్రవేశపెట్టిన పథకాలను గురించి సభలు నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు పెంటర్‌ రాజు, చందు, సంతోష్‌, గంగాధర్‌గౌడ్‌, ఎర్రం ముత్యం, భాగ్యమ్మ, కస్తూరి లక్ష్మి, సురేందర్‌, నరేందర్‌, కృష్ణ, సంజీవ్‌, సాయిరెడ్డి, ప్రవీణ్‌, సాగర్‌, రాజు, తిరుపతి గౌడ్‌, జనార్ధన్‌, సాయికుమార్‌ తదితరులున్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *