Breaking News

Monthly Archives: September 2018

కెసిఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకే తాను రోడ్డు షో చేపట్టానని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన నిర్వహిస్తున్న రోడ్డుషో ఆదివారం కామారెడ్డి జిల్లా సరిహద్దు నర్సాపూర్‌ మీదుగా భిక్కనూరు, కామారెడ్డిలో కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు బస్వాపూర్‌, భిక్కనూరు వద్ద ఘన స్వాగతం పలికారు. ఆయన రోడ్డుషోకు విశేష జనాదరణ లభించింది. ఈ సందర్బంగా జరిగిన సభల్లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలని ...

Read More »

నీలాలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవం

రెంజల్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవాన్ని తహసీల్దార్‌ రేణుకాచవాన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి ప్రజలనుచైతన్యవంతులను చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ రఫియోద్దీన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సాయిలు, నారాయణ, లింగం తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ నిరంకుశ పాలనను తరిమికొడదాం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ నిరంకుశ పాలనను తరిమికొడదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్యపద్మ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కెసిఆర్‌ సర్కారు పూర్తిగా విపలమైందని విమర్శించారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కెజి నుంచి పిజి ఉచిత విద్య తదితర హామీలన్ని తుంగలో ...

Read More »

ఓటర్ల నమోదు సవరణల పరిశీలన

కామరెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ఓటరు నమోదు అభ్యంతరాలు, సవరణల పత్రాలను ఆదివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. గాంధారి తహసీల్దార్‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన గాంధారి ఓటరు నమోదుపై సమీక్షించారు. ఓటరు నమోదు ఫారం 7,8, అభ్యంతరాలు, సవరణలపై ఆరాతీశారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

Read More »

సోమవారం నుంచి ట్రెయినీ సివిల్‌ సర్వీస్‌ అదికారుల జిల్లా పర్యటన

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నుంచి ఆలిండియా సర్వీసుకు ఎంపికైన ట్రెయినీ సివిల్‌ సర్వీస్‌ అదికారులు జిల్లాలో పర్యటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ఐదుగురు సభ్యులుగల ఐఏఎస్‌, ఐపిఎస్‌ తదితర అఖిలభారత సర్వీసుకు ఎంపికైన పదిమంది శిక్షణలో భాగంగా అక్టోబరు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. ఐదుగురు ఒక బృందంగా ఏర్పడి జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో, మరో ఐదుగురు బృందం వర్ని ...

Read More »

రెంజల్‌లో ఘనంగా బోనాల పండుగ

రెంజల్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భజన తంత్రీల మధ్య కడలను ఊరేగించారు. గ్రామ శివారులోగల మహాలక్ష్మి ఆలయానికి చేరుకొని భక్తులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతియేటా ఈ పండగను గ్రామస్తులంతా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ పండుగను గ్రామస్తులు భక్తి శ్రద్దలతో సంతోషంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More »

ఆదివారం ముగిసిన ఈవిఎంల తనిఖీ

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారంతో ఈవిఎంల ప్రథమస్థాయి తనికీ పూర్తయినట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. ఆదివారం స్థానిక 4వ టౌన్‌ వద్దగల ఈవిఎం గోదామును ఆయన పరిశీలించారు. తనిఖీల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 23న జిల్లాకు 2240 బ్యాలెట్‌ యూనిట్లు, 1750 కంట్రోల్‌ యూనిట్లు, 1890 వ్యాట్‌లు వచ్చాయని, వీటిని బిఇఎల్‌ కంపెనీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పనితీరును ప్రథమస్థాయి తనికీ ఆదివారం రాత్రి వరకు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. ...

Read More »

యువకునికి ఎంపి బిబి.పాటిల్‌ చేయూత

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలానికి చెందిన వినోద్‌కుమార్‌ అనే యువకునికి జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ చేయూత నందిస్తున్నారు. వినోద్‌కుమార్‌ 2016లో చదువు పూర్తయిన వెంటనే బిహెచ్‌ఇఎల్‌లో అప్రెంటిస్‌ కోసం ఎంపిని సంప్రదించగా అందుకు సానుకూలంగా స్పందించిన ఎంపి అధికారులతో మాట్లాడి అప్రెంటిస్‌ ఇప్పించారు. వినోద్‌కుమార్‌కు మంచి నైపుణ్యం ఉందని, ప్రతికూల పరిస్థితుల వల్ల ఎంపిని ఆశ్రయించడం జరిగిందని, ఎంపి చొరవతో వినోద్‌కుమార్‌ అప్రెంటిస్‌లో చేరడం ద్వారా భవిష్యత్తు ఉజ్వలంగా మారిందని కుటుంబీకులు ...

Read More »

ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు మొదలయ్యాయి. ఆదివారం డిచ్‌పల్లి మండలం ఆరేపల్లి గ్రామస్తులు, మోపాల్‌ మండలం కంజర గ్రామస్తులు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామస్తులు, బర్దిపూర్‌ గ్రామస్తులు, కాలూరు గ్రామస్తులు, సిరికొండ మండలం గడ్కోల్‌ గ్రామస్తులు, న్యావనంది యాదవ సంఘం యువకులు, కుర్మ సంఘ పెద్దలు, ముషీర్‌ నగర్‌ గ్రామ యువకులు, గుండారం గ్రామ యువకులు, నల్లవెల్లి గ్రామ యువకులు, కొరట్‌పల్లి ముదిరాజ్‌ సంఘం ప్రతినిధులు, తాండా వాసులు, ...

Read More »

ప్రశాంతంగా కానిస్టేబుల్‌ ప్రిలిమరీ రాత పరీక్ష

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు రిక్రూట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్‌ ప్రిలిమరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లో మొత్తం 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 17,422 కాగా 16,398 మంది పరీక్షకు హాజరయ్యారని, 1024 మంది గైర్హాజరైనట్టు కమీషనర్‌ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలను కమీషనర్‌ పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ...

Read More »

డయల్‌ యువర్‌ సిపి సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలందరు 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలు విన్నవించుకోవాలని, ఫోన్‌ చేస్తున్నపుడు ఎలాంటి శబ్దం లేకుండా సమయ పాలన పాటిస్తు ఇతరులకు అవకాశం కల్పించాలని కమీషనర్‌ సూచించారు. బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్లలోని ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More »

శ్రీవాసవీ ఆర్యవైశ్య సేవాసమితి నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల న్యాల్‌కల్‌ రోడ్డులో అర్సపల్లి పురుషోత్తం గుప్త కళ్యాణమండపంలో ఆదివారం శ్రీవాసవీ ఆర్యవైశ్య సేవాసమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య అద్యక్షుడు బిగాల కృష్నమూర్తి, బిజెపి నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త హాజరై కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడుగా సంతోష్‌కుమార్‌ గుప్త, ఉపాధ్యక్షుడుగా గంగారత్నం, పద్మ శ్రీనివాస్‌, సత్యనారాయణ, ప్రవీణ్‌, అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌ కుమార్‌ గుప్త, ...

Read More »

నకాషీ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30   నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నకాషీ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా నకాషీ సంఘం అధ్యక్షుడు లింబయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లా, కామారెడ్డి జిల్లా, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి నకాషీ కుల ప్రతినిధులు హాజరయ్యారు. నకాషీ కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సభనుద్దేశించి లింబయ్య మాట్లాడుతూ నకాషీ కులస్తులు బిసి-బి లో ఉండడం వల్ల తమకు ...

Read More »

తెరాస సభను బహిష్కరించండి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 3న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తెరాస తలపెట్టనున్న బహిరంగ సభను దళితులు బహిష్కరించాలని భారతీయ జనతా పార్టీ ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస పార్టీ దళితులకు ఎన్నో ఆశలు చూపి ఓట్లు దండుకొని మోసం చేసిందని ఆయన ఆరోపించారు. గడచిన నాలుగున్నర సంవత్సరాలలో దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి అమలుకు ...

Read More »

మేయర్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర మేయర్‌ ఆకుల సుజాత ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తెరాస నాయకులు ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. 15వ డివిజన్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహించి తెరాస అధినేత కెసిఆర్‌ నిజామాబాద్‌ పర్యటన గురించి ప్రజలకు వివరించారు. బైక్‌పై తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అక్టోబరు 3న జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, ...

Read More »

ప్రచారంలో దూసుకెళ్తున్న బిగాల

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే అర్బన్‌ నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తు వచ్చే ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టాలని కోరుతున్నారు. దాంట్లో భాగంగా శనివారం ఖిల్లా చౌరస్తా నుంచి గురుద్వార, పెద్దబజార్‌, ఆర్యసమాజ్‌, గోల్‌హనుమాన్‌ మీదుగా ఫూలాంగ్‌ వరకు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, ఫ్లోర్‌ ...

Read More »

రెంజల్‌ రేషన్‌ డీలర్‌పై ఆర్డీవోకు ఫిర్యాదు

రెంజల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ గ్రామానికి చెందిన 18 నెంబరు చౌకదారుల దుకాణంపై శనివారం బోధన్‌ ఆర్డీవో గోపిరాం నాయక్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. గత ఏడాదిన్నర కాలం నుంచి అంత్యోదయ కార్డుకు 35 కిలోలు ఇవ్వాల్సింది పోయి వినియోగదారులకు 18,20 కిలోలు అందజేసి డీలర్‌ ప్రభాకర్‌ చేతులు దులుపుకుంటున్నారని వారు వాపోయారు. విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని అట్టి నివేదికను తమకు పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. తదుపరి చర్యలు తప్పవని ఆర్డీవో చెప్పారు. ఓటరు దరఖాస్తులను ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసిలో పదవీ విరమణ పొందిన బాస లింగంను ఆయన సన్మానించారు. అనంతరం మల్లారం ఎంపిటిసి, నాయకులతో సమావేశమయ్యారు. న్యావనంది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం మైలారం గ్రామస్తులు, డిచ్‌పల్లి మండలం గొల్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ గంగాధర్‌, గ్రామస్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, తెరాస ...

Read More »

ఉచిత మెగా వైద్య శిబిరం

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో శనివారం శ్రావ్యగార్డెన్స్‌లో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొద్దుటూరి సదానందరెడ్డి, మనోరమ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో బిపి, షుగర్‌, థైరాయిడ్‌, స్త్రీ సంబంధిత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్‌ పరీక్షలతో పాటు ఇతర అన్ని సూపర్‌ స్పెషాలిటి సర్వీసులను ఉచితంగా అందించారు. అదేవిధంగా కంటి ...

Read More »

ధూపల్లి మహాజనసభను బహిష్కరించిన రైతులు

– డైరెక్టర్లు హాజరుకాని సభలెందుకని కార్యదర్శిని నిలదీత రెంజల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి సొసైటీ మహాజనసభను శనివారం రైతులు బహిష్కరించారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు హాజరుకాని సభలెందుకు నిర్వహించాలంటూ కార్యదర్శిని జీవన్‌రెడ్డి నిలదీశారు. సభ ప్రారంభమై పలు రకాల ఖర్చులు, జమలు వివరిస్తుండగా మొత్తం చదివేంత వరకు ఓపికతో వివరిస్తుండగా మొత్తం చదివేంత వరకు ఓపికతో విన్న రైతులు ఒక్కసారిగా కార్యదర్శి తీరుపై విసుకుపడి సభ వాయిదాకు పట్టుబట్టి తీర్మానం చేయించారు. గత రబీ సీజన్‌లో ...

Read More »