Breaking News

Monthly Archives: October 2018

8 నుంచి సైన్స్‌ఫేర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్‌ పాఠశాలలో ఈనెల 8వ తేదీ నుంచి 10 వరకు జిల్లా స్థాయి గణిత వాతావరణ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఎగ్జిబిషన్‌లో వెయ్యిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటారన్నారు. ఎగ్జిబిషన్‌ మూడురోజులపాటు వీక్షించడానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు.

Read More »

రాశివనాన్ని మరింత అభివృద్ది చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న రాశి వనాన్ని మరింత అభివృద్ది చేయడానికి అన్ని చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబరులో జరిగిన రాశివనం నిర్వహణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రాశివనం నిర్వహణ అభివృద్ది కోసం పలు సూచనలు చేశారు. రాశివనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.ప్రవీణ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విదుల్లో పాల్గొనే అధికారులు అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించి స్ట్రాంగ్‌రూంల ఏర్పాటు, వసతి సౌకర్యాలపై ఎన్నికల అధికారులకు, పంచాయతీ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, పంచాయతీ రాజ్‌ ఇఇ సిద్దిరాములు, ప్రిన్సిపాల్‌ షేక్‌ సలాం, ...

Read More »

సుపరిపాలన కోసం బిజెపిని గెలిపించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో అందిస్తున్నట్టుగా రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే అది బిజెపివల్లే సాధ్యపడుతుందని ఆ పార్టీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం గురువారం సిఎస్‌ఐ మైదానంలో జరగనున్న పరిపూర్ణనంద స్వామి బహిరంగ సభకు సంబందించిన ఏర్పాట్లను పరిశీలించారు. స్వచ్చమైన పరిపాలన సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ బిజెపి వల్లే సాధ్యపడుతుందని స్వామి పరిపూర్ణనంద బిజెపిలో చేరారన్నారు. పార్టీలో చేరిన తర్వాత స్వామిజి తొలి రాజకీయ పర్యటనను కామారెడ్డి ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల పరిధిలోని పొందుర్తి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. పాతరాజంపేట గ్రామానికి చెందిన లక్కాకుల చంద్రయ్య (45) వ్యక్తిగత పనుల నిమిత్తం మోటరు సైకిల్‌పై వెలుతుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

ఆత్మహత్య యత్నానికి పాల్పడ కండక్టర్‌ మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తనను అక్రమంగా సస్పెండ్‌ చేశారని పేర్కొంటూ గతనెల 28న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ రాజా సులేమాన్‌ అనే కండక్టర్‌ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. దేవునిపల్లి సద్గురుకాలనీలో నివాసముంటున్న రాజా సులేమాన్‌ ఆర్టీసి కండక్టర్‌గా విదులు నిర్వహిస్తున్నాడు. అతన్ని విదుల నుంచి సస్పెండ్‌ చేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు ...

Read More »

జడ్పి మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు కాంగ్రెస్‌లో చేరిక

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లా జడ్పి మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు అన్వర్‌ పాషా బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో షబ్బీర్‌ అలీ పాషాకు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ది చేస్తుందనే దీమాతోనే పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, కారంగుల అశోక్‌రెడ్డి, పండ్ల రాజు తదితరులున్నారు.

Read More »

భారీ మెజార్టీతో గెలిపించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించాలని తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ కోరారు. దోమకొండ, బీబీపేట మండలాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బుధవారం తెరాసలోకి రావడం ఆయన కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే కామరెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రావు, ప్రేమ్‌కుమార్‌, బల్వంత్‌రావు, పిప్పిరి ఆంజనేయులు తదితరులున్నారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తుందని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమల్లారెడ్డి గ్రామంతో పాటు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రాబోయే ఎన్నికల్లో తెరాస అబ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ది జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లవెల్లి అశోక్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, మద్ది చంద్రకాంత్‌రెడ్డి, రాజు, తదితరులున్నారు.

Read More »

ఎన్నికల విధులను ప్రణాళిక బద్దంగా అమలు చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్చాయుతంగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులు తమకు కేటాయించిన విధులను ప్రణాళికా బద్దంగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాదిరెడ్డి సూచించారు. సోమవారం జనహితలో నోడల్‌ అధికారులతో ఏర్పాటైన సమావేశంలో సంయుక్త కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్‌ రోజున దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల్లో వినియోగించే వాహనాలపై స్టిక్కర్లు అతికించాలని ...

Read More »

అయోడిన్‌ లోపంపై అవగాహన అవసరం

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో అయోడిన్‌లోపం వల్ల 2.8 మిలియన్‌ జనాభా వివిధ రకాల రుగ్మతలతో బాదపడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని జిల్లా మాస్‌ మీడియా అధికారి సువర్ణకుమారి, సాందీపని కళాశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబా, జిల్లా ఆరోగ్య బోధకుడు సంజీవరెడ్డిలు అన్నారు. సోమవారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో అయోడిన్‌ లోపం వాటివల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వ్యక్తికి 100-150 ఎంసిజి అయోడిన్‌ అవసరమని ...

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ అన్నారు ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. సువిద యాప్‌ ద్వారా, పివిజల్‌ యాప్‌ద్వారా వచ్చిన అనుమతులు, ఫిర్యాదులపై సమీక్షించారు. పోలింగ్‌ సిబ్బంది వివరాలను ఎన్‌ఐసి ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్ల వివరాలు, వెబ్‌ క్యాస్టింగ్‌ అవసరమున్న స్టేషన్ల వివరాలు, దివ్యాంగుల కోసం చేస్తున్న ...

Read More »

కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆద్వర్యంలో రాస్తారోకో

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజాంసాగర్‌ చౌరస్తాలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్‌ ఆపరేటర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అందరి ఇళ్లకు వినోదాన్ని అందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని సంఘం అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌ కోరారు.

Read More »

దక్షిణ ప్రాంగణం పట్ల వివక్షత వీడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ ప్రాంగణం పట్ల వివక్షత విడనాడాలని విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బలరాం నాయక్‌ను సోమవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించినప్పటికి కోర్సులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయన్నారు. ఇక్కడి భవనాలను వేరే విద్యాసంస్థల కిస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో నూతనంగా పిజి కోర్సులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం కలుగుతుందని ...

Read More »

పట్టభద్రులందరు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే శాసనమండలి ఎన్నికల దృష్ట్యా పట్టభద్రులందరు ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని టిఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అల్క కిషన్‌ అన్నారు. సోమవారం ఓటు హక్కు – మన ప్రాథమిక హక్కు – ఓటు ఒక వజ్రాయుదం అనే శీర్షికన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తు జిల్లాలోని పట్టభద్రులందరు నవంబర్‌ 6వ తేదీ వరకు ఓటరు ...

Read More »

డయల్‌యువర్‌ సిపిలో 12 పిర్యాదులు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి 12 ఫిర్యాదులు అందాయి. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ డివిజన్‌ లనుంచి బాదితులు డయల్‌ యువర్‌ సిపి ద్వారా తమ సమస్యలను కమీషనర్‌తో విన్నవించారు. ఈ సందర్భంగా కమీషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేస్తామని కమీషనర్‌ పరిధిలోని ప్రజలందరు డయల్‌ యువర్‌ సిపిని సద్వినియోగంచేసుకొని సమస్యలు పరిస్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పట్ల ...

Read More »

యువ నాయకులకు అవకాశం ఇవ్వాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇతర ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ జాతీయ నాయకులు సుభాష్‌ చోప్టా అన్నారు. సోమవారం ఢిల్లీలో సామాజిక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకుడు ఉప్పు సంతోష్‌ చోప్టాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చోప్టా మాట్లాడుతూ యువకుల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని, యువకులు రాజకీయాల్లోకి వస్తే దేశం మరింత అభివృద్ది చెందుతుందని, ఉప్పు సంతోష్‌ లాంటి నాయకులకు టికెట్‌ ...

Read More »

దొంగిలించబడిన ద్విచక్ర వాహనాల స్వాధీనం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో సోమవారం 3వ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. రైల్వే కమాన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హమాల్‌వాడికి చెందిన గంగాకిరణ్‌ వర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద నుంచి దొంగిలించబడిన రెండు ద్విచక్ర వాహనాలను టిఎస్‌ 16 ఇజి 1704 హీరోహోండా ప్యాషన్‌ ప్లస్‌, ప్యాషన్‌ ప్రోలను, అదేవిధంగా గుర్బాబాది రోడ్డులో మహ్మద్‌ అన్వర్‌ను అదుపులోకి ...

Read More »

ఆనంద్‌రెడ్డిని కలిసిన మంచిప్ప గ్రామస్తులు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రూరల్‌ నియోజకవర్గ అబ్యర్థి ఆనంద్‌రెడ్డిని మంచిప్ప గ్రామస్తులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం నిర్వాకం వల్ల తమ గ్రామానికి అన్యాయం జరిగిందని, ప్రాజెక్టు పేరుతో భూములను తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మంచిప్ప ప్రాజెక్టును పాత పద్దతిలో ఉంచినా ప్రయోజనకరంగా ఉండేదని, కొత్త ప్రణాళికతో పెద్దగా ఒరిగేదేమి లేదని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై ఆనంద్‌రెడ్డి స్పందిస్తు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ...

Read More »

భూపతిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్‌లోకి పలువురు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కాంగ్రెస్‌ రూరల్‌ అబ్యర్థి డాక్టర్‌ బూపతిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిదులు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ గంగపుత్ర సంఘం ప్రతినిదులు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ముస్లింలు తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం సిరికొండ గ్రామ చర్చి సభ్యులు భూపతిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ...

Read More »