Breaking News

ఎన్నికల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌తో 24 గంటల నిఘా

కామారెడ్డి, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో ప్లయింగ్‌ స్క్వాడ్స్‌ ద్వారా 24 గంటల నిఘా ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జనహిత భవనంలో ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్క్వాడ్స్‌, స్టాటిస్టికల్‌ సర్వే లైన్స్‌ టీం, వీడియో టీం, అకౌంటింగ్‌ టీంలు 24 గంటల పాటు నిర్విరామంగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తారని పేర్కొన్నారు. సెక్టోరియల్‌ అదికారులకు మెజిస్టేరియల్‌ పవర్స్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా వీరు పనిచేస్తారని వివరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, జిల్లా ఆడిట్‌ అధికారి రాము, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *