Breaking News

రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మండలంలోని నీలా గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అఖిలబేగం, నిర్మల, గంగామణి, సిసి రాజయ్య, గ్రామస్తులు రాఘవేందర్‌, గంగాకిషన్‌, రఘు తదితరులున్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *