Breaking News

Daily Archives: October 9, 2018

టిఎస్‌ జేఏసి ఆవిర్భావం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాధించుకున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ కాలేదని, ఉద్యమకారుల పట్ల, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పది విద్యార్థి సంఘాలతో టిఎస్‌ జేఏసి ఏర్పాటు చేసినట్టు ప్రతినిదులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా విద్యార్థి సంఘాలు ఏకమవుతూ జేఏసిగా ఏర్పడుతున్నాయని, నాటి సమైక్యవాదుల బానిస చెర నుంచి తెలంగాణ ...

Read More »

భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తి శ్రద్దలతో, శాంతియుతంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సూచించారు. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి అనుమతి పొందాలని, చందా విషయంలో ఎవరిని బలవంతం చేయకూడదని, దుర్గామాత సందర్శనకు వచ్చే మహిళలపై యువతులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా స్పీకర్‌ల విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, సమస్యలు ఏర్పడితే డయల్‌ ...

Read More »

బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మంగళవారం 12,20వ డివిజన్‌లలో ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా గుప్త మాట్లాడుతూ అర్బన్‌ నియోజకవర్గ ప్రజల నుంచి తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, ప్రతి ఇంటిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారున్నారని, విషయం తెలిసి తమకెంతో సంతోసం కలిగిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ...

Read More »

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాకు చెందిన యెండల సౌందర్య నిఖత్‌ జరీన్‌, గుగులోత్‌ సౌమ్య, పూర్ణ తదితరులు జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని కలెక్టర్‌ తెలిపారు. గెలుపు ఓటములు క్రీడా స్పూర్తిగా తీసుకొని ఓటమి చెందినపుడు కుంగిపోకుండా తిరిగి విజయం సాధించడానికి పట్టుదలతో కృషి ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ లలిత

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మంగళవారం నందిపేట మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను పోటీచేయనున్న ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరుతూ పాదయాత్ర నిర్వహిస్తు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళ తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ...

Read More »

సౌదీలో మృతుల దేహాలను స్వదేశానికి రప్పించాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల సౌదీలో మృతి చెందిన నందిపేట్‌ మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన దేవిదాస్‌, నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెందిన సయ్యద్‌ సత్తర్‌ మృత దేహాలను స్వదేశానికి రప్పించాలని తెలంగాణ గల్ప్‌ ఫోరం అధ్యక్షుడు వసంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 9న ఇద్దరు మృతి చెందారని, సౌదీలో ఒకే గదిలో ఉంటూ పనులు చేసుకునేవారని, అగ్నిప్రమాదం చోటుచేసుకోగా మృతి చెందారని వివరించారు. నాటి నుంచి బాధిత ...

Read More »