Breaking News

సౌదీలో మృతుల దేహాలను స్వదేశానికి రప్పించాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల సౌదీలో మృతి చెందిన నందిపేట్‌ మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన దేవిదాస్‌, నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెందిన సయ్యద్‌ సత్తర్‌ మృత దేహాలను స్వదేశానికి రప్పించాలని తెలంగాణ గల్ప్‌ ఫోరం అధ్యక్షుడు వసంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 9న ఇద్దరు మృతి చెందారని, సౌదీలో ఒకే గదిలో ఉంటూ పనులు చేసుకునేవారని, అగ్నిప్రమాదం చోటుచేసుకోగా మృతి చెందారని వివరించారు. నాటి నుంచి బాధిత కుటుంబీకులు వారి మృత దేహాల కోసం ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవిదాస్‌కు కూతురు, కుమారుడు, సత్తర్‌కు ఇద్దరు కూతుళ్ళు, కుమారుడు ఉన్నారని, వారి కుటుంబాల పరిస్థిత దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృత దేహాలను స్వదేశానికి రప్పించడంతో పాటు రూ. 10 లక్షల ఆర్తిక సాయం అందించాలని, తెలంగాణ గల్ప్‌ ఫోరం బాధిత సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో బాదిత కుటుంబాల సభ్యులు స్వప్న, నరేశ్‌, సురేశ్‌, దేవన్న, రజియా బేగం, తదితరులున్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *