Breaking News

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ లలిత

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మంగళవారం నందిపేట మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను పోటీచేయనున్న ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరుతూ పాదయాత్ర నిర్వహిస్తు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళ తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు దూరమవుతాయని లలిత స్పష్టం చేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇక్కడి ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందని, తప్పకుండా తాను ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని లలిత అన్నారు. ఇక్కడి ప్రజల సేవకు తాను ఎల్లవేళలా సిద్దంగా ఉన్నానని అన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *