Breaking News

టిఎస్‌ జేఏసి ఆవిర్భావం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాధించుకున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ కాలేదని, ఉద్యమకారుల పట్ల, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పది విద్యార్థి సంఘాలతో టిఎస్‌ జేఏసి ఏర్పాటు చేసినట్టు ప్రతినిదులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా విద్యార్థి సంఘాలు ఏకమవుతూ జేఏసిగా ఏర్పడుతున్నాయని, నాటి సమైక్యవాదుల బానిస చెర నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడి ఎన్నో కేసులు ఎదుర్కొన్న తమను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాద కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులపై ఇప్పటికి కేసులున్నాయని, విద్యార్థి నాయకులపై కేసులు ఉండడం వల్ల సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్తులపై, నిరుద్యోగులపై చిన్నచూపు చూస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఏకమై రానున్న ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా పనిచేసి నియామకాల పట్ల హామీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని వారు తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజు, రాజశేఖర్‌, భానుప్రసాద్‌, నవాతె ప్రతాప్‌, కిరణ్‌, మహేశ్‌, అన్వేష్‌, భిక్షపతి తదితరులున్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *