Breaking News

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాకు చెందిన యెండల సౌందర్య నిఖత్‌ జరీన్‌, గుగులోత్‌ సౌమ్య, పూర్ణ తదితరులు జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని కలెక్టర్‌ తెలిపారు. గెలుపు ఓటములు క్రీడా స్పూర్తిగా తీసుకొని ఓటమి చెందినపుడు కుంగిపోకుండా తిరిగి విజయం సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తే విజయం తప్పకుండా వరిస్తుందని కలెక్టర్‌ అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి, శరీర పటుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ సహాయ కార్యదర్శి సయ్యద్‌ మసూద్‌ అలీ, మహ్మద్‌ రియాజ్‌, ఉమ్మడి జిల్లాల ప్రాంతీయ సమన్వయ అధికారి మహ్మద్‌ ముస్తఫా ఖాన్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *