Breaking News

స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

 

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్‌ రూరల్‌ రికన్‌స్ట్రక్షన్స్‌ ఆద్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయసేవాధికార సంస్థ, సీనియర్‌ సివిల్‌ జడ్జి చంద్రకళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి మానవులు దైనందిన జీవితంలో చాలా ఒత్తిడికి గురవుతున్నారని, దీనికి ముఖ్య కారణం మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయని, ఎవరి ఆలోచనలు వారిలో అణిచివేస్తున్నారని అన్నారు. ఆలోచనలు ఇతరులతో పంచుకోవాలని అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని చిన్న చిన్న విషయాలకు నేటితరం యువత ఆందోళన పడి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఒంటరితనానికి దగ్గరవుతున్నారని, ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా పదిమందిలో కలిసి ఉన్నపుడే ప్రజలకు విషయాలు తెలిసి మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. ఏదైనా మానసిక రుగ్మతకు గురైతే వెంటనే చికిత్సకు పంపి తగ్గించాలని ఆమె సూచించారు.

నేటి పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలను చదువుల పేరిట మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఈవిషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించి పిల్లలు కష్టపడకుండా ఇష్టపడి చదివేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్రవంతి, మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ విశాల్‌, సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్‌ జ్యోతి, న్యాయవాదులు ఆశ నారాయణ, రాజేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, ప్రోగ్రాం మేనేజర్‌ మోయిజ్‌ అహ్మద్‌, సొసైటీ సిబ్బంది తదితరులున్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *