Breaking News

Daily Archives: November 1, 2018

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం సూచిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు పారదర్శకంగా, జవాబుదారిగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. రాజకీయ పార్టీ నుంచి ఏజెంట్లను ఎన్నికల సమయంలో తీసుకోవల్సిన అనుమతులు, ముందస్తు చర్యలపై అధికారులకు గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిరోజు జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు పూర్తి సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఎన్నికల తేదికి వారంరోజుల ...

Read More »

70 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడతాం

– స్వామి పరిపూర్ణనంద కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడుతుందని స్వామి పరిపూర్ణనంద అన్నారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన బిజెపి విజయభేరి యాత్రలో పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్రజలు బిజెపికి పట్టం కట్టారని, 22 రాష్ట్రాల్లో పార్టీ సుపరిపాలన అందిస్తోందని పేర్కొన్నారు. అదే పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వందేమాతరం మీద అభ్యంతరం తెలిపిన అభ్యర్థి కావాలో, అవినీతి చేసిన అభ్యర్తి ...

Read More »

రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పోటీకి సిద్దం

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంకోసం ధర్మం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని పార్టీ తనను ఎక్కడినుంచి పోటీ చేయమన్నా తాను సిద్దమని స్వామి పరిపూర్ణనంద అన్నారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొనేందుకు వచ్చిన స్వామీజీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మొత్తం కమలవికాసం ఖాయమని, 70కి పైగా స్థానాలను బిజెపి సాధిస్తుందని జోస్యం చెప్పారు. వెంకటరమణారెడ్డి గెలుపు ఖాయమని, మెజార్టీ ఎంతో ...

Read More »

మచ్చలేని నాయకుని గెలిపించాలి

– అధర్మ, అవినీతి పార్టీలను తరిమికొట్టాలి – స్వామి పరిపూర్ణనంద పిలుపు కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతి, అధర్మ పార్టీలను తరిమికొట్టి మచ్చలేని వ్యక్తులను గెలిపించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు స్వామి పరిపూర్ణనంద పిలుపునిచ్చారు. గురువారం రాత్రి కామారెడ్డిలో నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రధాని మోడిచేస్తున్న సంక్షేమ పథకాలే కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాయని పేర్కొన్నారు. కామారెడ్డికి చెందిన ఇరుపార్టీల అభ్యర్థులు గాంధీ విగ్రహం వద్ద అవినీతికి పాల్పడినట్టు విమర్శలు ...

Read More »

రాబోయేది తెరాస ప్రభుత్వం

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం స్థానిక ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో 16వ వార్డు నుంచి 23వ వార్డు వరకు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హాజరై మాట్లాడారు. కెసిఆర్‌ చేస్తున్న వందలాది సంక్షేమ పథకాలే తెరాస ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాయన్నారు. ప్రజల్లో తెరాసకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. వివిధ వార్డులకు చెందిన ఆయా పార్టీ కార్యకర్తలను తెరాసలోకి ఆహ్వానించి కండువాలు వేశారు. ...

Read More »

ఆంధ్రానగర్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

నందిపేట్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఆంధ్రానగర్‌ ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం ఆర్టీసి బస్సు టివిఎస్‌ లూనా వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణీకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే మండలంలోని ఆంధ్రానగర్‌ గ్రామానికి చెందిన గద్దల సాయిలు (52), రామారావు (45) అనే రైతులు రోజువారిగా పొలం పనికి వెళ్ళి వరి ఎండబెట్టి తిరిగి వస్తుండగా గ్రామంలోని రోడ్డు డివైడర్‌ దాటుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసి బస్సు టివిఎస్‌ను ఢీకొనడంతో ప్రయాణిస్తున్న ఇద్దరిలో సాయిలుపై ...

Read More »