Breaking News

Daily Archives: November 2, 2018

వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరులేని సమయంలో ప్యానుకు ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.

Read More »

తెరాసలో చేరికలు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ, బీబీపేట మండలాల్లోని ఆయా పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెరాస పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు ఆంజనేయులు, బల్వంత్‌రావు తదితరులున్నారు.

Read More »

లీవ్‌ అండ్‌ లెట్‌ లైవ్‌ ఆధ్వర్యంలో 4న వైద్య శిబిరాలు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లీవ్‌ అండ్‌ లెట్‌ లైవ్‌ ఆధ్వర్యంలో 4వ తేదీన నగరంలో గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల, కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డులో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాము పడకంటి తెలిపారు. వైద్య శిబిరానికి వివిధ ఆసుపత్రుల నుంచి ప్రత్యేక వైద్యులు వస్తున్నారని, ఇందులో ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. బిపి, డయాబెటిస్‌, హిమోగ్లోబిన్‌, రక్త గ్రూపు పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, ...

Read More »

ఆనంద్‌రెడ్డి ఆద్వర్యంలో బిజెపిలోకి భారీ వలసలు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం భారీగా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. నిజామాబాద్‌ మండలంలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి స్టేషన్‌ తాండా గ్రామస్తులు కూడా ఆనంద్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు వేసుకున్నారు. నిజామాబాద్‌ మండలం పాల్దా గ్రామస్తులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడి దేశంలో అమలు చేస్తున్న ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ లలిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆకుల లలిత శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం నందిపేట మండలం ఐలాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో విఐపి యూత్‌, ప్రెసిడెంట్‌ యూత్‌ సభ్యులు చేరారు. నందిపేట మండల కేంద్రంలో రాజ్‌నగర్‌ దుబ్బలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.

Read More »

ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మహా సమ్మేళనం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మహా సమ్మేళనం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసి కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరి ఆచార్య, జగన్‌మోహన్‌గౌడ్‌ తెలిపారు. సెక్షన్‌ 41 ఎ సిఆర్‌పిసి ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేయాలని, న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని, యువ న్యాయవాదులకు నెలకు రూ. 10 వేల రూపాయల స్టయిఫండ్‌ ఇవ్వాలని, కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన ...

Read More »

నిజామాబాద్‌ బిజెపిలో భగ్గుమన్న విభేదాలు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ భారతీయ జనతా పార్టీ టికెట్‌ను పార్టీ అధిష్టానం యెండల లక్ష్మినారాయణకు కేటాయించడంతో ధన్‌పాల్‌ వర్గీయుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ధన్‌పాల్‌ అనుచరులు కొందరు పార్టీ కార్యాలయంలోకి చొరబడి కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొంతకాలంగా బిజెపి అర్బన్‌ టికెట్‌ను ధన్‌పాల్‌కు ఇస్తారనే ప్రచారం జోరుగా కొనసాగింది. కానీ చివరి నిమిషంలో పార్టీ సీనియర్‌ నాయకులు యెండలకు టికెట్‌ కేటాయించడంతో ఒక్కసారిగా ...

Read More »

టిపిసిసి ప్రచార కమిటీలో ఇందూరువాసికి చోటు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిసిసి ప్రచార కమిటీలో ఇందూరు వాసికి చోటు లభించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తు ప్రచార వ్యూహంలో ఎన్‌ఆర్‌ఐలకు చోటు కల్పించింది. ఇందులో భాగంగా లండన్‌లో స్థిరపడ్డ నిజామాబాద్‌ వాసి సుధాకర్‌గౌడ్‌కు ప్రచార సబ్‌ కమిటీలో చోటు లభించింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసిన నియామక పత్రాన్ని ఈమెయిల్‌ ద్వారా సుధాకర్‌గౌడ్‌కు అందించారు. ఈ సందర్భంగా సుధాకర్‌గౌడ్‌ మీడియాకు తెలియజేస్తు నవంబర్‌ ...

Read More »

సెక్టోరల్‌ అధికారుల విదులు ఎంతో ముఖ్యమైనవి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్‌ అధికారుల విధులు ఎంతో ముఖ్యమైనవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సెక్టోరల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సదుపాయాలు, రూట్ల వారిగా వివరాలు, ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత పలు దఫాల్లో సెక్టోరల్‌ అధికారుల విదులు బాధ్యతాయుతంగా ఉంటుందని, అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమీషన్‌ ...

Read More »

జిల్లా వ్యాప్తంగా రవాణా అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జిల్లా రవాణా అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో స్కూలు బస్సులను తనికీ చేశారు. ఈ సందర్భంగా సరైన ఫిట్‌నెస్‌ లేని బస్సులను, సరైన పత్రాలు లేని బస్సుల స్కూళ్ళకు జరిమానా, కేసులు నమోదు చేసినట్టు జిల్లా రవాణా శాఖాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్‌లో నిజామాబాద్‌ అర్బన్‌లో 15 కేసులు, భీమ్‌గల్‌ మండలంలో 5 కేసులు, ఇందల్వాయి మండలంలో 3 కేసులు, రూరల్‌లో 7 కేసులు నమోదు చేసినట్టు ...

Read More »