Breaking News

Daily Archives: November 3, 2018

తెరాసలో పలువురి చేరిక

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇస్రోజివాడి, ఉగ్రవాయి గ్రామాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఇస్రోజివాడి గ్రామానికి చెందిన యాదవసంఘం నాయకులు కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరారు. ఉగ్రవాయి గ్రామానికి చెందిన నాయిబ్రాహ్మణ కులస్తులు జొన్నల రమేశ్‌ ఆధ్వర్యంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తెరాస కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.

Read More »

పూజారిని హత్యచేసిన సయ్యద్‌ను ఉరితీయాలి

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మతోన్మాదుల దాడిలో గాయపడి మరణించిన వరంగల్‌ అర్చకుడు సత్యనారాయణ శర్మను చంపిన మతోన్మాది హుస్సేన్‌ సయ్యద్‌ను ఉరితీయాలని బిజెపి కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల పర్యటన సందర్భంగా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా హిందువులపై దాడులు పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు ఇందుకు కారణమని విమర్శించారు. కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కులాలను ...

Read More »

ఎన్నికల విధులపై వీడియో కాన్ఫరెన్సు

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్భంగా విధుల్లో పాల్గొనే అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటిదశ ర్యాండనైజేషన్‌ కేటాయింపు కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రాష్ట్ర స్థాయిలో అడిషనల్‌ ముఖ్య ఎన్నికల అదికారి బుద్ద ప్రకాశ్‌, జాయింట్‌ ముఖ్య ఎన్నికల అధికారి ఆమ్రపాలి పాల్గొన్నారు. జిల్లా ...

Read More »

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

– కెసిఆర్‌ ఆటలు చెల్లవు కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ఇకపై కెసిఆర్‌, తెరాస ఆటలు చెల్లవని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ సర్పంచ్‌ పిరంగి రాజేశ్వర్‌తోపాటు అంబర్‌పేటకు చెందిన 500 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 18వ వార్డు మునిసిపల్‌ కౌన్సిలర్‌ ముదాం సిద్దమ్మ, మాజీ కౌన్సిలర్‌ ముదాం ఎల్లయ్యలు పార్టీలో చేరారు. వీరితోపాటు రాజంపేట, కొటాల్‌పల్లి, రాఘవపూర్‌, వెల్పుగొండ, ...

Read More »

పూజారి హత్యను నిరసిస్తూ విహెచ్‌పి ర్యాలీ

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ సాయిబాబా ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ హత్యను నిరసిస్తూ కామారెడ్డిలో శనివారం రాత్రి విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలో వేకువజామునే సుప్రభాతం పెట్టిన పూజారిపై దుండగుడు దాడికి దిగి తీవ్రంగా గాయపరచగా పూజారి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. పూజారిని హత్యచేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం పూజారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Read More »

ఎన్నికల విధులను అధికారులు సమన్వయంతో నిర్వహించాలి

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే అధికారులు పోలింగ్‌రోజు నాయకత్వం, సహకారం, సమన్వయంతో క్రియాశీలకంగా ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. డిసెంబరు 7న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి సెక్టోరల్‌ అధికారులు, అసెంబ్లీ స్తాయి మాస్టర్‌ ట్రెనర్స్‌కు శనివారం జనహితలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌రోజు తీసుకోవాల్సిన చర్యలు, తదితరాలపై వివరించారు. పోలింగ్‌రోజు ఉదయం 7 గంటలకు ముందే నిర్వహించే మాక్‌ పోలింగ్‌ అనంతరం ...

Read More »

బిఎల్‌వోలు అందుబాటులో ఉండాలి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల దృష్ట్యా బిఎల్‌వోలు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఈనెల 4న ఓటరు జాబితాలో పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌వోలు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓటరు జాబితాలో తమ పేరు సరిచూసుకోవడానికి ఈనెల 4న ఆదివారం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌వోలు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. పేర్లు లేకపోతే జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ...

Read More »

ఎమ్మెల్సీ బరిలో న్యాయవాది రెంజర్ల సురేశ్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది రెంజర్ల సురేశ్‌ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నట్టు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీనమోదు 2015 నవంబర్‌ 1వ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు చేసుకొని తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తానుకూడా ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నానని, నాలుగు జిల్లాల పట్టభద్రులు, న్యాయవాదులు, వైద్యులు, ...

Read More »

సాయి సాత్విక్‌ కుటుంబానికి న్యాయం చేయాలి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కంజర మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురై మృతి చెందిన 5వ తరగతి విద్యార్థి సాయి సాత్విక్‌ కుటుంబానికి న్యాయం చేయాలని పిడిఎస్‌యు ప్రతినిదులు జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, జిల్లాలోని అన్ని గురుకుల, కెజిబివి లకు ప్రహరీలను నిర్మించాలని, మెరుగైన విద్యుత్‌ లైటింగ్‌ సౌకర్యం కల్పించాలని, పరిసరాలను శుబ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ...

Read More »

కంజర గ్రామంలో ఆనంద్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ రూరల్‌ అబ్యర్తి ఆనంద్‌రెడ్డి శనివారం మోపాల్‌ మండలంలోని కంజర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు పార్టీలో చేరారు. అనంతరం ఆనంద్‌రెడ్డి బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రామ పెద్దలు ఆనంద్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస పాలనలో తమ గ్రామానికి ఒరిగిందేమి లేదని వారు విమర్శించారు. కనీస సౌకర్యాలైన ...

Read More »

అర్చకుడు సత్యనారాయణను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ అర్బన్‌లో పోచమ్మ మైదాన్‌లోగల శివసాయి మందిరంలో గతనెల 26న నిత్యపూజలో భాగంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్న ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణశర్మపై ముస్లింమతానికి చెందిన ఇమామ్‌ అనే గూండా నేరుగా మందిరంలో చొరబడి బూతులు తిట్టడమే గాకుండా భౌతికంగా దాడిచేశారని జిల్లా బ్రాహ్మణ అర్చక సమాఖ్య, హిందూ బ్రాహ్మణ ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. ఇమామ్‌ విపరీతంగా కొట్టడంతో అర్చకుడు సత్యనారాయణ కిందపడిపోయారని, విషయం గమనించిన భక్తులు వెంటనే అతన్ని నగరంలోని ...

Read More »

ఎన్నికల బరిలో ఉంటా

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల బరిలో ఉంటానని బిజెపి నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాను రాజకీయాలకు కొత్త అయినా అందరిని కలుపుకొని గత ఎన్నికల్లో పోటీ చేసి 20 వేల పైచిలుకు ఓట్లు సాధించానని అన్నారు. దేశ ప్రదాని మోడిని ఆదర్శంగా తీసుకొని పార్టీలోకి వచ్చానని, తన ట్రస్టు ద్వారా అనేక సేవలు చేశానని, మరింత సేవచేసే ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ లలిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆకుల లలిత శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంజర బిసి సంక్షేమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సాత్విక్‌ శుక్రవారం పాముకాటుకు గురవడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యార్థి కుటుంబాన్ని లలిత పరామర్శించారు. నగరంలోని దుబ్బ రాజీవ్‌నగర్‌లోని అశోక్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. గతనెల 30న అశోక్‌రెడ్డి మృతి చెందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ఆర్మూర్‌లో రాజారాంనగర్‌ కాలనీలో ప్రచారం ...

Read More »