Breaking News

Daily Archives: November 4, 2018

సంతలో బిఎల్‌ఎఫ్‌ అభ్యర్తి ప్రచారం

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండల కేంద్రంలో జరిగిన సంతలో ఆదివారం బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ మల్లికార్జున్‌ ఎన్నికల ప్రచారం చేశారు. సంతకు వచ్చిన కొనుగోలు, అమ్మకం దారులతో ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కామారెడ్డిలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థికే ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. ప్రజా, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా బిఎల్‌ఎఫ్‌ మ్యానిఫెస్టో ఉంటుందన్నారు.

Read More »

కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలి

కామరెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద్దర్మ సిఎం కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకే ఓటు వేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఆదివారం వరలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన 24వ వార్డు నుంచి 33 వార్డుల కార్యకర్త లసమావేశానికి హాజరై మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో తెరాసప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి వివరించాలన్నారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, ...

Read More »

గెలిపించండి అభివృద్ది చేస్తా

కామరెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం పట్టణంలోని 9,17,18 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన అభివృద్ది పనులను వివరించారు. రేషన్‌ దుకాణాల ద్వారా 9 నిత్యవసర సరుకులతోపాటు గ్యాస్‌ సిలిండర్లు -6, రైతురుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉంచడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ...

Read More »