Breaking News

Daily Archives: November 6, 2018

నగరంలో తెరాస అభ్యర్థి ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తెరాస ఎమ్మెల్యే అభ్యర్తి బిగాల గణేశ్‌ గుప్త మంగళవారం 3వ డివిజన్‌లోని కంఠేశ్వర్‌కళ్యాణ మండపం నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించగా ప్రజలు చిరునవ్వుతో స్వాగతం పలికారు. గజమాల, మంగళ హారతులతో ఎదురొచ్చి దీవెనలు అందించారు. బిగాల గణేష్‌ గుప్త మాట్లాడుతూ డివిజన్‌లో మరిన్ని రోడ్లు వేసి అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడి వాసులకు పొలాలు ఉండడంతో రైతుబంధు ద్వారా రూ. 8 వేలు సంవత్సరానికి అందిస్తున్నందుకు ...

Read More »

జిల్లాలో పేకాట నిషేదం

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట నిషేదం ఉన్నట్టు ఎస్‌పి శ్వేత తెలిపారు. ఇందుకు సంబందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చి నిబంధనలు పాటించాలన్నారు. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే పేకాట ఎవరైనా ఆడినట్టు తెలిస్తే సంబంధిత పోలీసు స్టేషన్లకు ...

Read More »

పోలీసుల ముమ్మర తనిఖీలు

కామరెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో మంగళవారం సుమారు 15 చోట్ల పోలీసులు ముమ్మర తనికీలు చేపట్టారు. ఎన్నికల కమీషన్‌ సూచించిన ప్రకారం పోలీసు అధికారుల ఆదేశాల మేరకు కామరెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా, ప్రియా డీలక్స్‌ రోడ్డు, సిరిసిల్లా రోడ్డుతోపాటు సదాశివనగర్‌, మాచారెడ్డి, భిక్కనూరు, తాడ్వాయి, ఎల్లారెడ్డి, గాంధారి, బాన్సువాడ ప్రాంతాల్లో సంబంధిత పోలీసు అధికారులతో పాటు బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కార్లలో డబ్బు తరలిస్తున్నారన్న అనుమానంతో తనికీలు చేపట్టారు. కొన్నిచోట్ల డబ్బు ...

Read More »

స్క్వాడ్స్‌ దాడులలో 13.69 లక్షల రూపాయల సీజ్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, ఎస్‌ఎస్‌టి టీంల తనిఖీలలో రూ. 31.69 లక్షలు, 9 వేల లీటర్ల మద్యం పట్టుకున్నట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం వరకు రూ. 13 లక్షల 69 వేల 810 నగదును తనికీలలో పట్టుకోవడం జరిగిందని, అంతేకాక 16.85 లక్షల విలువైన 9 వేల 205 లీటర్ల మద్యాన్ని కూడా సీజ్‌ చేసినట్టు కలెక్టర్‌ వివరించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులపై 9858 పోస్టర్లను, జెండాలను, బ్యానర్లను, గోడ ...

Read More »

పాలిటెక్నిక్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌, కౌంటింగ్‌ కేంద్రాలు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఎన్నికలకుగాను డిస్ట్రిబ్యూషన్‌, కౌంటింగ్‌ కేంద్రంగా పాలిటెక్నిక్‌ కళాశాలను ఎంపిక చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం ఆయన సిపి కార్తికేయ, సంబంధిత అధికారులతో పాలిటెక్నిక్‌ కళాశాలను సందర్శించారు. బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో 4, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో 2 నియోజకవర్గాలకు డిస్ట్రిబ్యూషన్‌, కౌంటింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. ఇందుకుగాను కళాశాలలను, పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయించడానికి అధికారులను ఆదేశించామన్నారు. అధికారులు, సిబ్బంది, పార్టీల ఏజెంట్లు వెళ్లడానికి దారికిగాను ...

Read More »