Breaking News

Daily Archives: November 8, 2018

102లో దరఖాస్తుల ఆహ్వానం

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జివికె ఇఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడిపిస్తున్న 102 అమ్మఒడి అంబులెన్సులో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్‌ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 22-35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నారు. ఎత్తు 5.4 అంగుళాలు ఉండాలని, డ్రైవింగ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం, ఎల్‌ఎంవి లైసెన్సు, బ్యాడ్జి నెంబరు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అబ్యర్థులు ఈనెల 9, ...

Read More »

మొక్కజొన్న పంటలను సందర్శించిన వ్యవసాయ బృందం

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్‌, జిల్లా వ్యవసాయాధికారులు సంయుక్తంగా గురువారం జిల్లాలోని మొక్కజొన్న పొలాలను సందర్శించారు. కట్టెల పురుగు ఉదృతిని గమనించారు. బృందం గాంధారి మండలంలోని గాంధారి, ముప్పారం, బొప్పాజిగూడ, సదాశివనగర్‌ మండలంలోని పద్మాజివాడ గ్రామాలను సందర్శించి మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. ప్రతి మొక్కజొన్న పొలంలో కట్టెల పురుగు, గుడ్ల సముదాయం, తొలిదశ లార్వాలో రెక్కల పురుగులను గుర్తించినట్టు చెప్పారు. కట్టెల పురుగు నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. కేంద్రీయ ...

Read More »

ఎన్నికల వ్యయ పరిశీలనకు ప్రత్యేక అధికారులు

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల, పార్టీల వ్యయ పరిశీలనకు ఎన్నికల పరిశీలనకోసం నలుగురు పరిశీలకులు జిల్లాను సందర్శించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం జనహితలో నోడల్‌ అధికారులతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను పరిశీలించడానికి అఖిలభారత సర్వీసుకు చెందిన ఆకాశ్‌ దేవేందన్‌లను నాగ్‌పూర్‌, హర్యానా, మహారాష్ట్రలకు చెందిన సుఖ్‌వీర్‌సింగ్‌, అభిషేక్‌ కృష్ణ, బీహార్‌కు చెందిన బ్రిజ్‌రాజ్‌ రాయ్‌లను నియమించబడ్డారన్నారు. వీరు జిల్లాకు వచ్చి ఎన్నికల వ్యయంపై సమీక్షిస్తారన్నారు. నామినేషన్‌ నుంచి అభ్యర్థులు ...

Read More »

హామీలు తప్ప ఆచరణలో కెసిఆర్‌ పూర్తిగా విఫలం

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హామీలివ్వడంలో తప్ప వాటి ఆచరణలో కెసిఆర్‌ ఆయన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అబ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఇంటింటి గడప గడపకు ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బతికేందుకు సరైన ఉపాది అవకాశాలు లేక ఇక్కడి యువత గల్ప్‌ బాటపడుతున్నారని, ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ కొలువులు లేక, ఉపాధి లేకే ఈ ...

Read More »

ఎన్నికల అభ్యర్థుల ఖర్చుపై పూర్తి వివరాలు సేకరించాలి

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థుల ఖర్చుపై నిఘా ఉంచాలని వాటి వివరాలు సేకరించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంసిద్దతపై గురువారం నోడల్‌ అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బ్యారికేడ్లు, ఇతర సదుపాయాలు కల్పించడానికి రిటర్నింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, బ్యారికేడ్లు, సిజెఐ షీట్లు ఏర్పాటు ...

Read More »

ఆనంద్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తాం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని బిజెపి నాయకులు బాగారెడ్డి అన్నారు. గురువారం డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో బాగారెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాగారెడ్డి మాట్లాడుతూ రూరల్‌ నియోజకవర్గంలో తెరాస పాలనలో అభివృద్దికి నోచుకోలేదని, ఆనంద్‌రెడ్డిని గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుంటామన్నారు. ఆనంద్‌రెడ్డి గెలుపునకు యువకులందరు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన ...

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దీపావళి సందర్భంగా వివిద గ్రామాల్లో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. రూరల్‌ పరిదిలో మొత్తం 99 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 లక్షల 30 వేల 790 నగదును స్వాదీనంచేసుకున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

ఆకుల లలిత ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిక

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత ఆద్వర్యంలో నందిపేటకు చెందిన పలువురు మైనార్టీలు గురువారం నగరంలోని ఆమె స్వగృహంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై స్వచ్చందంగా పార్టీలో చేరుతున్నారని, తాను నిజామాబాద్‌లో ఉన్నసంగతి తెలుసుకొని తన స్వగృహానికి వచ్చి మరి పార్టీ సభ్యత్వం తీసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వీరి రుణం ...

Read More »

నగరంలో పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో పలు పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు గురువారం తనిఖీ చేశారు. నకాశ్‌ గల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, కోటగల్లి శంకర్‌ భవన్‌ పాఠశాలలో పర్యటించి వసతులు పరిశీలించారు. శంకర్‌భవన్‌లో పలు పనులు పెండింగ్‌లో ఉన్నందున వెంటనే పూర్తిచేయించాలని అధికారులను ఆదేశించారు. మిర్చికాంపౌండ్‌ పరిసర ప్రాంత ఇళ్ళల్లో పర్యటించి ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారితో మాట్లాడారు. వారి ఇళ్లల్లో ఎంతమంది ఓటర్లు జాబితాలో ఉన్నాయని ...

Read More »

బిసిల మధ్య చిచ్చుపెట్టకండి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిల మద్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని తెలంగాణ బిసి మహాసభ జిల్లా కన్వీనర్‌ ఆదె ప్రవీణ్‌కుమార్‌ రాజకీయ పార్టీలను విజ్ఞప్తిచేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లకు మద్దతుగా రాజకీయ ప్రయోజనాల కోసం బిసి బంధువుల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని, ముదిరాజ్‌ బిడ్డలకు చెరువులపై హక్కు ఉంటదా? లేదా? అని అబద్దాల మాటలు చెప్పవద్దని అన్నారు. ఇలా ఎన్నిసార్లు అబద్దపు మాటలు చెప్పి బిసిల ...

Read More »

ప్రజా శ్రేయస్సే తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ లక్ష్యం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల శ్రేయస్సే తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ లక్ష్యమని నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజాప్రంట్‌కి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ప్రజా ఫ్రంట్‌ అనేక సంఘాలతో ఏర్పాటై పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజాస్వామిక తెలంగాణ కావాలని నినదిస్తు ఉందని ముఖ్యంగా రైతు, మహిళా, ...

Read More »

పేకాటరాయుళ్ళ అరెస్టు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి సందర్భంగా పేకాట ఆడినవారిని అరెస్టు చేసి వారి వద్దనుంచి రూ. 31 లక్షల 66 వేల 880 స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలోని ఆర్మూర్‌, బోదన్‌, నిజామాబాద్‌ డివిజన్‌లలో 228 కేసుల్లో 1433 మందిని అరెస్టుచేసి నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మొత్తం 3 డివిజన్‌లలో అత్యధికంగా నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 99 కేసులు నమోదు చేసి 4 లక్షల ...

Read More »