Breaking News

Daily Archives: November 10, 2018

పోలీసుల కవాతు

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో భాగంగా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు కవాతు నిర్వహించారు. బార్డర్‌ సెక్యురిటి ఫోర్సు, ప్రత్యేక పోలీసులు ఇంద్రనగర్‌, రాజీవ్‌నగర్‌, డ్రైవర్స్‌ కాలనీల్లో కవాతు నిర్వహించారు. శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాలని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఎస్‌హెచ్‌వో రామకృష్ణ ప్రజలకు తెలిపారు. ర్యాలీలో ఎస్‌ఐలు రవికుమార్‌, గోవింద్‌, రవీందర్‌రెడ్డి, మాజర్‌ తదితరులున్నారు.

Read More »

అభివృద్దికి పట్టం కట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ప్రజలు తిరిగి తెరాసకు పట్టం కట్టాలని తెరాస కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్ధన్‌ కోరారు. ప్రచారంలో భాగంగా శనివారం పలు గ్రామాల్లో పర్యటించారు. శివాయిపల్లి గ్రామంలో కానిస్టేబుల్‌ కిస్టయ్యకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కానిస్టేబుల్‌ కిష్టయ్యతోపాటు ఎంతోమంది విద్యార్థులు అమరులయ్యారని, అందరిని తమప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అవి ...

Read More »

అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజలు అండగా నిలవాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు నిలవాలని కామారెడ్డి బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. పల్లెపల్లెకు, గడప గడపకు బిజెపిలో భాగంగా శనివారం ఆయన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి, దోమకొండ మండలం దోమకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి, కాంగ్రెస్‌, తెరాసలో ఎన్నో ఏళ్ళుగా పరిపాలిస్తున్నా పేదలకు కనీసం ఇళ్ళులేవని, పూరిగుడిసెల్లో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లోకెళితే కనీస ...

Read More »

ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి- ఎ లోకి మారుస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి- ఎ లోకి మారుస్తామని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫంక్షణ్‌ హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లు వెనకబడి ఉన్నారని, తమ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి-ఎలోకి మార్చాడానికి జివో ఇచ్చినా సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. ముదిరాజ్‌ల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు డిమాండ్‌ సైతం ఉందని, ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల నమూనా పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటి దశ నమూనా, ర్యాండనైజేషన్‌ కార్యక్రమాన్ని శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఏఎంసి గోదాములోని ఎన్నికల ఫస్ట్‌ లెవల్‌ చెక్‌సెంటర్‌ను కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ర్యాండనైజేసణ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 11వ తేదీన అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ర్యాండనైజేషన్‌ కార్యక్రమం నిర్వహించి ఆయా నియోజకవర్గాలకు యంత్రాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ...

Read More »

12న కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 12న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని కామరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌ తెలిపారు. శనివారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12 నుంచి 19 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 21,22 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 22న అభ్యర్థుల ...

Read More »

నేనుసైతం ఆద్వర్యంలో ఆదివారం బాలోత్సవ్‌ – 2018

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ స్వచ్చంద సంస్థ నేను సైతం ఆధ్వర్యంలో ఆదివారం గాయత్రీనగర్‌లోని వెంకటేశ్వర కల్యాణమండపంలో నేను సైతం బాలోత్సవ్‌-2018 నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు రవిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. బాలోత్సవ్‌ ద్వారా వచ్చిన విరాళాలను నిరుపేదలైన విద్యార్థులకు చేయూత అందించడానికి ఉపయోగిస్తామని ఆయన వివరించారు. కార్యక్రమానికి సినీ ప్రముఖులు, సీనియర్‌ ఆర్టిస్టు అయిన సుధా, ప్రముఖ హాస్యనటుడు రవి, ప్రముఖ చాయా గ్రాహకులు సుధాకర్‌, నగరానికి చెందిన సామాజిక ...

Read More »

ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో భారీ చేరికలు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి ఆద్వర్యంలో శనివారం ఇందల్వాయి మండలం గౌరారం గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. వారికి ఆనంద్‌రెడ్డి పార్టీ కండువాలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రదాని నరేంద్రమోడి చేస్తున్న పనులకు ఆకర్షితులై చాలా మంది బిజెపిలో స్వచ్చందంగా చేరుతున్నారని, బిజెపితోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని, రూరల్‌ నియోజకవర్గంలో తాను ఊహించిన దానికంటే ప్రజల నుంచి భారీ స్పందన ...

Read More »

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన యెండల

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ శనివారం ఎల్లమ్మగుట్టలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మొదటగా తన సొంత కాలనీ అయిన ఎల్లమ్మ గుట్టలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనకు టికెట్‌ లభించడం ఎంతో ఆనందంగా ఉందని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్ని వర్గాల ...

Read More »

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన సిపి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో పోలింగ్‌ కేంద్రాలను శనివారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా ఉండాలని, అనుమానితులు కనిపించిన వెంటనే విచారించాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల బందోబస్తులో ఉన్న అధికారులను ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తామని, ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత శనివారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నందిపేట మండలం ఐలాపూర్‌ గ్రామంలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి, తెరాస పార్టీ నుంచి చాలా మంది స్వచ్చందంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని, ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలో ప్రజలు తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నారని, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేస్తానని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ...

Read More »

బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ఆపద్దర్మ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో కలిసి కోజా కాలనీ మైదానంలో సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి తెలంగాణలో తెరాస పార్టీని అధికారంలోకి తేవడం ఖాయమన్నారు. నిజామాబాద్‌ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్న బిగాల గణేశ్‌ గుప్తను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ...

Read More »

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

– నిజామాబాద్‌ ఎంపి కవిత నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తుందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌ ఎంపి కార్యాలయంలో రాష్ట్ర ఆపద్దర్మ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమి పేరిట మరోసారి తెలంగాణలో ఆంధ్రా చంద్రబాబుకు పెత్తనం చలాయించే అవకాశం కల్పించిందని ఆమె విమర్శించారు. మహాకూటమి మహా బూటకమని ఆమె అన్నారు. గత ఉమ్మడి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ...

Read More »

తెరాసకు ఓటు వేస్తాం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఇందల్వాయి మండలం గండితాండావాసులు శనివారం తెరాసకు మద్దతు ప్రకటిస్తు రానున్న ఎన్నికల్లో తెరాసకు ఓటువేసి గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించడం బంజారాల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని వారన్నారు. అబివృద్ది, సంక్షేమ పథకాలు బంజారాలకు మేలు చేశాయని, 40 సంవత్సరాల కల అయిన గండితాండా గ్రామ పంచాయతీగా ఏర్పాటుతో తమకు గుర్తింపు లభించిందని వారన్నారు. తాండాను పంచాయతీగా ఏర్పాటు ...

Read More »

వాహనాల తనిఖీల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శనివారం వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. కలెక్టర్‌ ధర్పల్లి, డిచ్‌పల్లి పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌ వస్తుండగా మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డువద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి టీం సభ్యులతో హైదరాబాద్‌ నుంచి వస్తున్న పలు వాహనాలను దగ్గరుండి తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రమ నగదు, మద్యం నియంత్రణకు విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో నగదును ...

Read More »