Breaking News

Daily Archives: November 11, 2018

ప్రజల పక్షాన నిలిచే పార్టీ బిజెపి

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను తీర్చే పార్టీ బిజెపియేనని ఆ పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పల్లెపల్లెకు, గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన బిక్కనూరు మండలం కంచర్ల, కాచాపూర్‌, కంజర్ల, లక్ష్మి దేవునిపల్లి, జంగంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకున్న తెరాస అందిన నిధులను నొక్కి తమ జేబుల్లో ...

Read More »

కెసిఆర్‌కు గజ్వేల్‌లో ఓటమి ఖాయం

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఓటమి ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి మండలం క్యాసంపల్లి, క్యాసంపల్లి తాండా, రాఘవపూర్‌, తాండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం తెరాస నాయకులు గ్రామాల్లోకి వెళుతుంటే ప్రజలు తరిమికొడుతున్నారని, చివరకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఉప సభాపతి పద్మ దేవేందర్‌లకు సైతం ప్రజల ఎదురుదాడి తప్పలేదన్నారు. నియోజకవర్గాల్లోకి ...

Read More »

బిజెపిలో పలువురు యువకుల చేరిక

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన వందమందికి పైగా యువకులు ఆదివారం బిజెపి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. పట్టణంలోని 50 మంది మైనార్టీ యువకులతోపాటు 80 మంది వరకు ఆయా పార్టీల యువకులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడి చేస్తున్న అభివృద్ది, అవినీతి రహిత పాలన చూసి మతాలకు అతీతంగా యువకులు భిజెపిలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అవినీతి రహిత పాలన ...

Read More »

బిఎల్‌ఎఫ్‌లో యువత చేరిక

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన లెప్ట్‌ ఫ్రంట్‌ పార్టీలో కామారెడ్డి పట్టణానికి చెందిన న్యాయవాది ముదాం నవీన్‌తోపాటు సుమారు 70 మంది యువకులు ఆదివారం పార్టీ అభ్యర్థి పుట్టమల్లికార్జున్‌ సమక్షంలో బిఎల్‌ఎఫ్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఉద్యోగాలు కల్పిస్తారని, సామజిక న్యాయం ఎజెండాగా సాగుతున్న బిఎల్‌ఎఫ్‌కు అండగా ఉంటామన్నారు. తెరాస నిరుద్యోగులను మోసం చేసిందని, అందుకే బిఎల్‌ఎఫ్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వెంకటరాములు, చంద్రశేఖర్‌, ...

Read More »

అభ్యర్థి ప్రతి రూపాయి ఖర్చు లెక్కచూపాలి

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి వారి ప్రతి రూపాయి వ్యయాన్ని లెక్కచూపాలని కామారెడ్డి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంజలాల్‌ మీనా తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ చాంబరులో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిదుల విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి 28 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పస్టం చేశారు. నామినేషన్‌కు ఒక రోజు ముందు అభ్యర్తి లేదా అతని ఎన్నికల ఏజెంట్‌పేరుపై ...

Read More »

అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల కేటాయింపు

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్‌ కార్యక్రమం ద్వారా వివిధ నియోజకవర్గాలకు ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలను కేటాయించినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఎంసి గోదాములోని ఎన్నికల స్ట్రాంగ్‌రూంలో వివిద పార్టీల సమక్షంలో మొదటిదశ ర్యాండమైజేషన్‌ కార్యక్రమం ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జుక్కల్‌ ...

Read More »

12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈనెల 12 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఈవిఎంల ప్రథమ రాండమైజేషన్‌కు సంబంధించి రాజకీయ పార్టీలు, రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, 19వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించడానికి అవకాశముందన్నారు. 20న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ చేసుకోవచ్చన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ...

Read More »

తెరాస నాయకుడిని పరామర్శించిన ఎంపి కవిత

రెంజల్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కాలి గాయంతో బాధపడుతున్న తెరాస నాయకుడు వికార్‌ పాషాను శనివారం రాత్రి ఆయన నివాసంలో ఎంపి కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్‌లు పరామర్శించారు. గాయపడిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బోధన్‌ మాజీ ఎంపిపి గిర్దావర్‌ గంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, అన్వర్‌, సుల్తాన్‌ ఉన్నారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

రెంజల్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఓబిసి జిల్లా కార్యదర్శి అసాని అనిల్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. గత పాలకులు చేయలేని అభివృద్దిని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా అభివృద్ది చేస్తుందన్నారు. కార్యక్రమంలో సాయాగౌడ్‌, రవి, నారాయణ, తిరుపతి, సాయిలు ...

Read More »

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

రెంజల్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఎంపిటిసి-2 భూమన్న, మాజీ ఉపసర్పంచ్‌ సుభాష్‌, మండల కిసాన్‌మోర్చా అధ్యక్షుడు అంతయ్య, విజయ్‌, బలరాంలు ఆదివారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి సుదర్శన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »