Breaking News

Daily Archives: November 12, 2018

అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రజలు మద్దతివ్వాలి

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతికి వ్యతిరేకంగా బిజెపి చేస్తున్న ఉద్యమానికి ప్రజలు తమ మద్దతు తెలపాలని కామారెడ్డి బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. గడప గడపకు, పల్లె పల్లెకు బిజెపి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మాచారెడ్డి, ఘనపూర్‌, అక్కాపూర్‌, దేవునిపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి రహిత కామారెడ్డి కావాలంటే బిజెపికి ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో సైతం బిజెపి ప్రభుత్వం ఏర్పడితే స్వచ్చమైన రాష్ట్రం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ...

Read More »

ప్రజల అభిమానం చూస్తుంటే గెలుపుఖాయమనిపిస్తోంది

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రచారంలో భాగంగా తాను ప్రజల వద్దకెళుతుంటే ప్రజల అభిమానాన్ని చూసి తన గెలుపు ఖాయమనిపిస్తోందని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని 19,20,21,22 వార్డుల్లో పాదయాత్ర చేస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, బాణా సంచాతో షబ్బీర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని, కష్టాలు అనుభవిస్తున్నారని, కష్టాలు తొలగిపోవాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. చదువుకొని ...

Read More »

వార్డుల్లో తెరాస నాయకుల ప్రచారం

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల్లో సోమవారం తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటువేసి గంప గోవర్ధన్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని వివరించారు. కెసిఆర్‌ తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బంగారు తెలంగాణగా అభివృద్ది చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మినారాయణ, కుంబాల రవి, శ్రీనివాస్‌, విజయ్‌, లక్ష్మణ్‌, మల్లేశం, వెంకటి, ...

Read More »

సోమవారం నామినేషన్లు నిల్‌

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సోమవారం ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదు. అన్ని పార్టీల అభ్యర్థులు మంచి రోజులు, తిథులు, నక్షత్రాలు చూసుకొని నామినేషన్‌ సమర్పించేందుకు సిద్దపడడంతో సోమవారం ఒక్కనామినేషన్‌ కూడా దాఖలు కాలేదని అధికారులు చెప్పారు.

Read More »

ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విదుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఫారం-12 ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని నోడల్‌, రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం కలెక్టర్‌ చాంబరులో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెబ్‌ క్యాస్టింగ్‌ కోసం 740 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కేంద్రాలు, సిసి టివిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులుగా రాంజీలాల్‌ మీనా, సుఖ్‌వీర్‌సింగ్‌, అభిసేక్‌ కృష్ణ, బ్రిజ్‌రాజ్‌ రాయ్‌లను జిల్లాకు నియమించారని వారు జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ...

Read More »

బాలల హక్కులను హరిస్తే శిక్షార్హులు

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కులను ఏ రూపంలోనైనా హరిస్తే కఠినంగా శిక్షించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్త్రీ శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలల హక్కుల వారోత్సవాలు పురస్కరించుకొని సోమవారం స్థానిక జూనియర్‌ ప్రభుత్వ కళాశాలల నుండి పాఠశాల విద్యార్థుల చేత జరిగిన మారథన్‌ వాక్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం జనహితలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. నేటి బాలలే ...

Read More »

ర్యాంప్‌ నిర్మాణ పనుల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ స్టేషన్లలో దివ్యాంగులకు వసతి సౌకర్యాల ఏర్పాటులో భాగంగా ర్యాంపు నిర్మాణ పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. భిక్కనూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, ముత్యంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లలో ర్యాంపుల నిర్మాణ పనులు పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సోహెల్‌, అధికారులు ఉన్నారు.

Read More »

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామ ఎంపిటిసి 1 – లక్ష్మి, పేపర్‌మిల్‌ గ్రామాలకు చెందిన బిజెపి, తెరాస కార్యకర్తలు సుమారు వందమంది సోమవారం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి సుదర్శన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుని గత ప్రభుత్వం చేయని అభివృద్దిని కాంగ్రెస్‌ పార్టీతో చేసుకుంటామన్నారు. సుదర్శన్‌రెడ్డి గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసి 20 ...

Read More »

ఆదరించండి, అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తా అని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. రెంజల్‌ మండలంలోని పేపర్‌మిల్‌ గ్రామంలో సోమవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు ముందుంటుందని ప్రజలు ఆశీర్వదించి తిరిగి కాంగ్రెస్‌ని గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. తెరాస పార్టీ నాలుగున్నరేళ్ళలో ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి మోసం చేసిందని ఇపుడు ప్రజలు ...

Read More »

తెరాసను అధిక మెజార్టీతో గెలిపిస్తాం

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెరాస మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం తెరాస పార్టీ ఆద్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, మౌలానా, కాశం ...

Read More »

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబందించి నోటిఫికేషన్‌ను సోమవారం జారీ అయింది. నియోజకవర్గాల వారిగా నోటిఫికేషన్‌ జారీచేశారు. ఎన్నికల కమీషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈనెల 19వరకు నామినేషన్ల స్వీకరణ, 20న నామినేసన్ల పరిశీలన, 22న ఉపసంహరణ అదేరోజు సాయంత్రం తుది జాబితా డిసెంబరు 7న పోలింగ్‌, 11న ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కౌంటింగ్‌ ...

Read More »

బిజెపిలో చేరిన ఖిల్లా తాండా వాసులు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఖిల్లా తాండా వాసులు సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ రూరల్‌ అభ్యర్థి గడ్డం ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలో తాండావాసులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ రూరల్‌ నియోజకవర్గంలో బిజెపి పటిష్టంగా మారిందని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని దాంతోపాటు రాష్ట్రంలో బిజెపి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

Read More »

డయల్‌ యవర్‌ సిపిలో 6 పిర్యాదులు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి 6 పిర్యాదులు అందాయి. ఆర్మూర్‌, బోదన్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు కమీషనర్‌ తెలిపారు. ఫిర్యాదులను సంబందిత పోలీసు స్టేషన్లకు పంపి దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కమీషనర్‌ తెలిపారు. కమీషనరేట్‌లోని ప్రజలందరు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి డయల్‌ యువర్‌ సిపిని వినియోగించుకోవాలని కమీషనర్‌ సూచించారు.

Read More »

నామినేషన్‌ దాఖలు చేసిన ఆకుల లలిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం ఆకుల లలిత నామినేషన్‌ దాఖలు చేశారు. తన సహచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Read More »