Breaking News

నామినేషన్‌ దాఖలు చేసిన పోచారం

బాన్సువాడ, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన స్థానిక సరస్వతి మందిరం, అయ్యప్ప ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. తనకు కలిసొచ్చిన సెంటిమెంట్‌గా ఉన్న అంబాసిడర్‌ కారులో ఆనవాయితీ ప్రకారం వెళ్లి నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్‌ అధికారి వెంకటేశం నామినేసన్‌ పత్రాలు అందించారు. స్థానిక నాయకులు ఆయనకు మద్దతు నిలువగా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రముఖ న్యాయవాది భూషణ్‌రెడ్డి, మండల తెరాస నాయకులు మోహన్‌ నాయక్‌ వెంట ఉన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *