Breaking News

Daily Archives: November 15, 2018

ఉపకార వేతనాల దరఖాస్తు తేదీ పొడిగింపు

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు డిగ్రీ, పిజి, బిఇడి ఇతర అన్ని కళాశాలల్లో బిసి, ఈబిసి విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాల దరఖాస్తు తేదిని పొడిగించినట్టు జిల్లా వెనకబడిన తరగతుల అధికారి తెలిపారు. డిసెంబరు 31 వరకు దరఖాస్తు తేదీని పొడిగించినట్టు చెప్పారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను బిసి, ఈబిసి విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ష్ట్ర్‌్‌జూ://్‌వశ్రీaఅస్త్రaఅaవజూaరర.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read More »

గురువారం ఒక నామినేషన్‌ దాఖలు

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం ఒక నామినేషన్‌ దాఖలైనట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అబ్యర్తిగా మహ్మద్‌ ఫజలూర్‌ రహమాన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. జుక్కల్‌, కామారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని పేర్కొన్నారు.

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అధికారులకు అవగాహన ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై ప్రొసిడింగ్‌ అధికారుల విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జూనియర్‌ కళాశాలలో ప్రొసీడింగ్‌, అసిస్టెంట్‌ ప్రొసైడింగ్‌ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమీషన్‌ సూచనల మేరకు 50 మందికి ఒక బ్యాచ్‌ చొప్పున శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహనలో ప్రొసీడింగ్‌ అధికారుల బాధ్యత కీలకమని, శిక్షణను ...

Read More »

తెరాస ద్వారానే ప్రగతి సాద్యం

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ప్రగతి కుంటుపడిందని తెరాసను తిరిగి అధికారంలోకి తెస్తేనే ప్రగతి సాధ్యపడుతుందని కామారెడ్డి తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం ఆయన రెడ్డిపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాపాలకులు తెలంగాణను పట్టించుకోకుండా నాశనం చేశారని విమర్శించారు. అందుకోసమే తెరాస ముఖ్యమంత్రి కెసిఆర్‌ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళుతున్నామని, తెరాసకు తిరిగి ఓటువేసి అభివృద్దికి పట్టం ...

Read More »

బిజెపిని గెలిపిస్తే మూడునెలల్లో తాగునీటి సమస్య పరిష్కారం

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్య ప్రస్తావిస్తున్నారని తనను గెలిపిస్తే మూడునెలల్లో తాగునీటి సమస్య పరిస్కరిస్తామని కామరెడ్డి బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఆయన గడప గడపకు బిజెపి ప్రచారంలో భాగంగా పాత రాజంపేట్‌, నర్సన్నపల్లి, క్యాసంపల్లి, తాండా, రాఘవపూర్‌, ఉగ్రవాయి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడితోపాటు రోడ్లు, ...

Read More »

విద్యార్థి నిరుద్యోగ గర్జన విజయవంతం చేయండి

రెంజల్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని ఏబివిపి మండల అధ్యక్షుడు గంగాప్రసాద్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ముందు విద్యార్థి నిరుద్యోగ గర్జన గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు నిజామాబాద్‌లో తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని నిరుద్యోగులను మోసం చేసిన తెరాస ప్రభుత్వానికి వచ్చే ...

Read More »

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమ పాలన

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కోరుకుంటున్న సంక్షేమ పాలన అందుతుందని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని తుజాల్‌పూర్‌, షేరిబీబీపేట్‌, బీబీపేట్‌, యాడారం, మల్కాపూర్‌, రాంరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుజాల్‌పూర్‌ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ నయాపైసా అభివృద్ది చేయలేదని విమర్శించారు. తన హయాంలో రెండు కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మించినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి ...

Read More »

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

బాన్సువాడ, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు గురువారం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని పోతంగల్‌, హంగర్గ గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోతంగల్‌ శివారులోని మంజీర వంతెన వద్దగల చెక్‌పోస్టును సైతం ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట అధికారులు ఉన్నారు.

Read More »

బీర్కూర్‌ మండలంలో పోచారం ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి, ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ఆయన మండలంలోని దామరంచ, అన్నారం తదితర గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెరాసదేనని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, పోచారం తనయుడు భాస్కర్‌రెడ్డి, తదితరులు ...

Read More »