Breaking News

Daily Archives: November 17, 2018

విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది విద్యార్థులకు టై, బెల్టు, ఐడెంటి కార్డులను వితరణ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సాయిలు, ఆంజనేయులు, ఉపాధ్యాయులు రాజు, గంగారాం, శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌తోనే పేదలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సాయరెడ్డి అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో శనివారం బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, రాజీవ్‌ యువకిరణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిందన్నారు. తెరాస ప్రభుత్వం హామీలపేరిట ప్రజలను మోసం ...

Read More »

షకీల్‌ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం తెరాస పార్టీ ఆధ్వర్యంలో బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు లింగారెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, ...

Read More »

కదిలిన గులాబి దండు

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను అధిక మెజార్టీతో గెలిపించుకుని తిరిగి తెరాస జెండా ఎగురవేస్తామని గులాబి దళం కదం తొక్కింది. మండలంలోని తాడ్‌బిలోలి, బోర్గాం గ్రామాలకు చెందిన తెరాస నాయకులు మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, రైతు సమన్వయ సమితి జిల్లాసభ్యుడు మౌలానా ఆధ్వర్యంలో శనివారం బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ నామినేషన్‌కు భారీగా తరలివెళ్ళారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్దే ధ్యేయంగా అహర్నిశలు ప్రజల కోసం కృషి చేసే షకీల్‌ అన్నకు ...

Read More »

కమీషనరేట్‌ పరిధిలో 236 ఈ చాలన్‌ కేసులు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో నవంబర్‌ 17వ తేదీ శనివారం నాటికి మూడురోజుల్లో 236 ఈ చాలన్‌ కేసులు నమోదుచేసినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ వెల్లడించారు. వీటిల్లో త్రిబుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ క్రాసింగ్‌, డేంజర్‌ డ్రైవింగ్‌, నో ఎంట్రీ, ఎల్‌ బోర్డులు లేని కొత్త డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం, రాంగ్‌రూట్‌, సర్వీసురోడ్డుపై పార్కింగ్‌, సరైన పత్రాలులేని వాహనదారులు, నెంబరు ప్లేట్లు లేని వాహనాలకు ఈచాలన్‌ కేసులు ...

Read More »

34వ డివిజన్‌లో బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త శనివారం 34వ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. డివిజన్‌లో ఇంటింటికి తిరుగుతూ తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తు ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా గణేశ్‌ గుప్తమాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి తెరాస అధికారం చేపట్టడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలే తనను తన పార్టీని గెలిపిస్తాయని ఈ సందర్భంగా బిగాల అన్నారు. ప్రచారంలో నగర మేయర్‌ ఆకుల ...

Read More »

యెండల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బిజెపి అర్బన్‌ నియోజకవర్గ అభ్యర్తి యెండల లక్ష్మినారాయణ శనివారం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నగరంలోని అశోక్‌నగర్‌, నటరాజ్‌ థియేటర్‌ ఎదురుగాగల హనుమాన్‌ మందిరం ప్రాంతాల్లో, మిర్చికాంపౌండ్‌లో పర్యటించి రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. అనంతరం 9,10వ డివిజన్‌లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ...

Read More »

ఆకుల లలిత ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి పలువురు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత సమక్షంలో వెల్మల్‌ గ్రామ యువకులు శనివారం కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ గ్రామ గ్రామాలనుంచి ప్రజలు స్వచ్చందంగా తన అభ్యర్థిత్వానికి మద్దతునిస్తు పార్టీలో చేరుతున్నారని, తనను ఇంటి ఆడపడుచుగా భావించి సాదరంగా ఆహ్వానిస్తు ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆర్మూర్‌ ప్రజల రుణం తీర్చుకుంటానని లలిత పేర్కొన్నారు.

Read More »

రూరల్‌ నియోజకవర్గంలో ఆనంద్‌రెడ్డి బిజిబిజి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో బిజిబిజిగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా శనివారం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామం, అమృతాపూర్‌ గ్రామాల్లో, నడిపల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనేకమంది ఇతర పార్టీల నాయకులు భారీగా ఆనంద్‌రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయమని, రూరల్‌ ప్రజలు తనను ఆప్యాయంగా ఆదరిస్తున్నారని, దేశప్రధాని ...

Read More »

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపి కవిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఎంపి కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా సుద్దపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెరాస అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తాయని అన్నారు. అభివృద్దిని అడ్డుకునేందుకు మహాకూటమి పేరిట కాంగ్రెస్‌, టిడిపి, మరో రెండు పార్టీలు జతకట్టాయని ఆమె విమర్శించారు. మహాకూటమిలో ప్రజలు ఎవరు లేరని ...

Read More »

ఎట్టకేలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయంలో పెండింగ్‌లో ఉన్న అంశం శనివారంతో తెరపడింది. పార్టీ హైకమాండ్‌ శనివారం జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులను తమ అభ్యర్థులుగా అధికారికంగా ప్రకటించింది. మూడో జాబితాలో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తాహెర్‌బిన్‌ హందాన్‌, బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి డాక్టర్‌ భూపతిరెడ్డిని ప్రకటించారు. గత కొంతకాలంగా మహా కూటమి వల్ల సీట్ల సర్దుబాటు విషయంలో ఆలస్యమైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ ...

Read More »

పిల్లల్లో నైపుణ్యం పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల్లో నైపుణ్యం పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమాధికారిణి స్రవంతి అన్నారు. శనివారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలని దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు ...

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా ధన్‌పాల్‌ నామినేషన్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యాస్‌భవన్‌లో తన అనుచరులతో, ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించిన అనంతరం దన్‌పాల్‌ స్వతంత్రుడిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో తాను నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీచేస్తున్నానని, తనను గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజా సేవచేస్తానని, గత 30 సంవత్సరాలుగా ...

Read More »

నామినేషన్‌ దాఖలు చేసిన బోధన్‌ తెరాస అభ్యర్థి షకీల్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ తెరాస అభ్యర్థి షకీల్‌ అహ్మద్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఎంపి కవిత పాల్గొన్నారు. భారీ ఊరేగింపుతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 2 కి.మీ.ల మేర వేలాది మంది పార్టీ కార్యకర్తలు, షకీల్‌ అభిమానులు ర్యాలీగా సాగుతూ బతుకమ్మలు, డప్పు చప్పుల్ళు, సన్నాయి వాయిద్యాలు, తెలంగాణ ఉద్యమ పాటలు, కార్యకర్తల చిందులతో పట్టణ ప్రధాన దారులు కిక్కిరిసి పోయాయి. కార్యక్రమంలో తెరాస ...

Read More »

7వ రోజున 33 నామినేషన్లు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఏడవరోజు జిల్లా వ్యాప్తంగా 33 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 11, బోధన్‌ నియోజకవర్గంలో 12, బాన్సువాడ నియోజకవర్గంలో 14, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 17, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 18, బాల్కొండ నియోజకవర్గంలో 19 నామినేషన్లు శనివారం వరకు దాఖలైనట్టు పేర్కొన్నారు.

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్టు నామినేషన్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన జర్నలిస్టు కె.వి.లక్ష్మారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అవగాహన కేవలం విలేకరులకు మాత్రమే ఉంటుందని, నిరంతరం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే విలేకరులకు ప్రజా సమస్యలపై పూర్తి స్పష్టత ఉంటుందని ఆయన అన్నారు. అదే కోణంలో నిజామాబాద్‌ ప్రజలకు సేవచేయడానికి ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేశానని, విలేకరులు చేసిన విధంగా ప్రజాసేవ మరెవరు చేయరని ఆయన పేర్కొన్నారు. ...

Read More »