Breaking News

ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత బిజి బిజి

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత సోమవారం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పెర్కిట్‌ ఎంపిటిసి పద్మజ మోహన్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం వారితో కలిసి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎంపిటిసి నాగమణి, సాయారెడ్డి, ఎంపిటిసి సాయన్న తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నందిపేట గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆర్మూర్‌ ప్రజలు తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నారని, తన గెలుపు తథ్యమని, ఎమ్మెల్యేగా గెలిచి ఆర్మూర్‌ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటానని అన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *