Breaking News

సొంత గ్రామంలో పర్యటించిన ఆనంద్‌రెడ్డి

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి సోమవారం తన స్వంత గ్రామమైన కేశ్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కేశ్‌పల్లిలోని కేశవనాథ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కేశ్‌పల్లి గంగారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. తన సొంత గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తానన్నారు. అనంతరం యువకులు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *