Breaking News

తెరాసతోనే అభివృద్ధి

 

బాన్సువాడ, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ మండలం దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. తన తండ్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆయన బాన్సువాడ మండలంలో సోమవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతోపాటు మండలంలోని గుడ్మి గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల కోసం, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులున్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *