Breaking News

కామారెడ్డి అభివృద్ది బిజెపితోనే సాద్యం

 

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ది భారతీయ జనతాపార్టీతోనే సాద్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని 4వ, 5వ, 10వ, 11వ వార్డుల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్ళుగా టిడిపి, కాంగ్రెస్‌, తెరాసలు కామారెడ్డిని పాలించినా ఏం అభివృద్ది వెలగబెట్టారని ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, మురికి కాలువలు, రోడ్లు సైతం లేవని పేర్కొన్నారు. కామారెడ్డి డెయిలీ మార్కెట్‌ను చూస్తుంటే గత పాలకుల పాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్దికి అవకాశం కల్పించాలని కోరారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *