Breaking News

హామీలు నెరవేర్చని తెరాస నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది

 

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా తెరాస నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ విమర్శించారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుని సిఎం చేస్తానని లేకుంటే తల నరుక్కుంటా అని, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నాడు, మరి కెసిఆర్‌ ఇచ్చాడా ఆయన ప్రశ్నించారు. ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారని అన్నారు. పేదలకు వంద రూపాయల చీరలు ఇచ్చి వారిని అవమాన పరిచారన్నారు. దోమకొండ, బీబీపేట మండలాలు కనీస బస్సు సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక్కడ ప్రభుత్వాసుపత్రి తన హయాంలో నిర్మిస్తే కనీసం అందులో గంప గోవర్దన్‌ వైద్యులను తేలేకపోయారని దుయ్యబట్టారు. తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్ది చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *