Breaking News

శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలు

 

రెంజల్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలను పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశాన్ని మండల అధ్యక్షురాలు జమున అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు అభివృద్ది చెందాలంటే ప్రతినెల సంఘాలతో సమావేశాలు ఏర్పరుచుకోవాలన్నారు. శ్రీనిధి రుణాలు పెండింగులో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించుకోవాలని తిరిగి మళ్లీ వడ్డిలేని రుణాలు పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. కార్యక్రమంలో సిసిలు శ్యామల, కృష్ణ, రాములు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *