Breaking News

దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనడం వారి మనోబలానికి నిదర్శనం

 

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనడం వారి మనోబలానికి నిదర్శనమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. డిసెంబరు 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇందిరాగాంధీ స్టేడియంలో దివ్యాంగుల క్రీడోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దివ్యాంగులు చదువు, క్రీడలు తదితర రంగాల్లో ఉన్నతిని సాధించాలని అభిలాషించారు. ఎన్నికల్లో దివ్యాంగులందరితో ఓటు నమోదు చేయిస్తామని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అనంతరం ఎన్నికల సిబ్బంది దివ్యాంగులకు వీవీప్యాట్‌, ఈవిఎం యంత్రాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ, మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి రాధమ్మ, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, మెప్మా జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *