Breaking News

దుర్కిలో పోచారం ఎన్నికల ప్రచారం

 

బాన్సువాడ, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని దుర్కి తదితర గ్రామాల్లో బుధవారం ఆపద్దర్మ మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ది తమ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాలతోపాటు రైతు సంక్షేమానికి కెసిఆర్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *