Breaking News

Daily Archives: November 22, 2018

సంక్షేమ పథకాలకు పెద్దపీట

  బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే మరోసారి తెరాస ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో కల్లూరు, లింగాపూర్‌, గన్నారం, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. సాగునీటి, తాగునీటి రంగాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. పింఛన్లను పెంచి వికలాంగులను, ...

Read More »

24న పాత్రికేయులకు కంటివెలుగు శిబిరం

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఈనెల 24న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు కంటివెలుగు కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. జనహిత సమావేశమందిరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు శిబిరం ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Read More »

నలభై ఏళ్ళు పాలించిన నాయకులు ఏం చేశారని ఓటేద్దాం

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గత నలభై ఏళ్లుగా పాలించిన వివిద పార్టీల నాయకులకు ఏం అభివృద్ది చేశారని ఓటేయాలని కామారెడ్డి నియోజకవర్గ బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిలదీశారు. గురువారం ఆయన బీబీపేట మండలం మాందాపూర్‌, మాచారెడ్డి మండలం సోమార్‌పేట్‌, భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై ఏళ్లుగా పాలించిన నాయకులు గాందీ విగ్రహం వద్ద తాము సంపాదించిన అక్రమ ఆస్తుల గురించి చర్చలు, డిబెట్లు పెట్టారు తప్ప ...

Read More »

హామీలు తప్ప ఏమీ చేయనివారికి ఎందుకు ఓటెయ్యాలి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ అధికారంలోకి వచ్చాక 180 వాగ్దానాలు చేశారని, అందులో ఏ ఒక్కటి సంపూర్తిగా నెరవేర్చలేకపోయారని అలాంటి పార్టీ వ్యక్తులకు ఎందుకు ఓటెయ్యాలని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అబ్యర్థి షబ్బీర్‌ అలీ నిలదీశారు. గురువారం ఆయన కామారెడ్డి మండలం లింగాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్ళు ఇస్తాం, అందమైన భవనాలు నిర్మించి ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. తాము పింఛన్లు పెంచుతామంటే ...

Read More »

రాష్ట్రంలో జరిగిన సంక్షేమాన్ని చూసి తెరాసకు ఓటు వేయండి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన నాలుగున్నరేళ్ళలో తెరాస హయాంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమాన్ని చూసి ప్రజలు తిరిగి ఓటువేయాలని కామరెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు మండలం బాగిర్తిపల్లి, ఇసన్నపల్లి, ర్యాగట్లపల్లి, గుర్జకుంట, సిద్దిరామేశ్వరనగర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన కెసిఆర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అనేక సంక్షేమ ...

Read More »

24 నుంచి ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24వ తేదీ నుంచి ఫోటో ఓటరు స్లిప్పులను డిసెంబరు 1వ తేదీలోగా బూత్‌ లెవల్‌ అధికారులతో పంపిణీ చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. గురువారం తన చాంబరు ద్వారా కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, సహ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. నూతనంగా ఓటు నమోదు చేయించుకున్నవారికి కార్డులు పంపిణీ చేయాలని తెలిపారు. పంపిణీ ...

Read More »

పోలింగ్‌ శాతం పెంచేలా చర్యలు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం మునిసిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 19నుంచి అన్ని గ్రామాల్లో ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ద్వారా ఓటు నమోదు చేయువిధానంపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు లక్ష 52 వేల 620 మంది ...

Read More »

ఆనంద్‌రెడ్డి విస్తృత ప్రచారం

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి గురువారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం మోపాల్‌ మండలం తాడెం, కులాస్‌పూర్‌ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోపాల్‌ బిజెపి అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆద్వర్యంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు బిజెపిలో చేరారు. ఆనంద్‌రెడ్డి మాట్లడుతూ నియోజకవర్గాన్ని గత పాలకులు పూర్తిగా విస్మరించారని, అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు ...

Read More »

కాంగ్రెస్‌ను అధిక మెజార్టీతో గెలిపిస్తాం

  రెంజల్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయారెడ్డి అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు నర్సయ్య, శ్రీనివాస్‌, పురం నర్సయ్య, ప్రవీణ్‌, హన్మంత్‌ ...

Read More »

విద్యార్థులకు బహుమతుల ప్రదానం

  రెంజల్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం ఫ్రెండ్స్‌ యూత్‌ అధ్యక్షుడు నవీన్‌ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు నిఖిల్‌, ప్రవీణ్‌, సాయినాథ్‌, గంగాప్రసాద్‌ తదితరులున్నారు.

Read More »

అభివృద్దికి ఓటు వేయండి

  ఆర్మూర్‌ సభలో ఆపద్దర్మ సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ఓటు వేసి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల్ని కోరారు. గురువారం ఆర్మూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అధికారం కోసం మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దని, గతంలో ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్‌, టిడిపిలు తెలంగాణ పట్ల ...

Read More »

ఎన్నికల ప్రచారంలో భూపతిరెడ్డి దంపతులు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ భూపతిరెడ్డి దంపతులు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుండారం, జలాల్‌పూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్డుషో నిర్వహించి తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. అదేవిధంగా భూపతిరెడ్డి సతీమణి వినోదిని సుద్దులం, మైలారం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కొరట్‌పల్లి, కెపి తండా గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని రూరల్‌ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు.

Read More »

కోరుకొండ సైనిక పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని మాజీ సైనికులు, వారి పిల్లల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. 6వ తరగతి ప్రవేశం కొరకు విద్యార్థులకు 31 మార్చి 2019 నాటికి 10-12 వయస్సు కలిగి ఉండాలని, 9వ తరగతి ప్రవేశం కొరకు 31 మార్చి 2019 నాటికి ...

Read More »