Breaking News

అభివృద్దికి ఓటు వేయండి

 

ఆర్మూర్‌ సభలో ఆపద్దర్మ సిఎం కెసిఆర్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ఓటు వేసి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల్ని కోరారు. గురువారం ఆర్మూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అధికారం కోసం మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దని, గతంలో ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్‌, టిడిపిలు తెలంగాణ పట్ల వివక్ష చూపుతూ అభివృద్దిని అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇపుడు మహాకూటమి పేరుతో మరో కొత్త నాటకానికి తెరలేపారని, దీనికి సూత్రదారి ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు అని, కాంగ్రెస్‌ నేతలు తిరిగి తెలంగాణను బానిసలుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారని కెసిఆర్‌ మండిపడ్డారు. తెలంగాణకు దేశంలో నెంబర్‌ వన్‌ స్థానం కల్పించిన ఘనత తెరాస ప్రభుత్వానిదని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిదంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక అన్ని ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమిగా మారాయని అది మహాకూటమి కాదని మహాబూటకమని ఎద్దేవా చేశారు. తామందిస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు అర్హులందరికి పింఛన్లు వర్తింపజేస్తామని అన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడేవిధంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని, తెలంగాణ వస్తే ఎక్కడా కరెంటు రాదని ప్రచారం చేసిన ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరం విద్యుత్‌ అందిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని కెసిఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తమ పార్టీకి మంచి విజన్‌ ఉందని, అభివృద్దిలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా మంచి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రాన్నిరానున్న రోజుల్లో మరింత అభివృద్ది చేసి ఇతర దేశాల్లో కూడా రాష్ట్రం గురించి చర్చించుకునేలా చేస్తామన్నారు. ఆశీర్వాద సభలో ఆర్మూర్‌ తెరాస అభ్యర్థి జీవన్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి కవిత, నాయకులు సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *