Breaking News

Daily Archives: November 23, 2018

గుబాలిస్తున్న గులాబీ

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెరాస మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు. మండలంలోని కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శుక్రవారం తెరాస పార్టీ ఆద్వర్యంలో బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి ...

Read More »

అభ్యర్థులు ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు అభిషేక్‌ కృస్ణ సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి సందేహాలున్నా ఉదయం 11 నుంచి 1 గంట వరకు పరిశీలకులను సంప్రదించాలని, వాట్సాప్‌, ఫోన్‌ నెంబరు ద్వారా సైతం సంప్రదించవచ్చని చెప్పారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల రెండవ ర్యాండమైజేషన్‌లో ...

Read More »

కాంగ్రెస్‌తోనే అభివృద్ది సాధ్యం

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయారెడ్డి, ఓబిసి జిల్లా అధ్యక్షుడు అసాని అనిల్‌ అన్నారు. మండలంలోని రెంజల్‌, బోర్గం గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ ...

Read More »

నీలాలో పోలీసుల కవాతు

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా, పేపర్‌మిల్‌ గ్రామాల్లో శుక్రవారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీధుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా ఈ ర్యాలీని బిఎస్‌ఎఫ్‌ జవాన్లతో నిర్వహించారు. ఈ కవాతులో ఏసిపి రఘు, సిఐ షకీర్‌ అలీ, ఎస్‌ఐ శంకర్‌ పాల్గొన్నారు.

Read More »

తెరాసలో చేరికలు

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తెరాస అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ సమక్షంలో శుక్రవారం పలు గ్రామాలకు చెందిన నాయకులు తెరాసలో చేరారు. ఇస్సానగర్‌ రెడ్డిసంఘం, పల్వంచ ఆటోయూనియన్‌ సభ్యులు, రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు, మాచారెడ్డి మండలం ఫరీద్‌ పేట గ్రామస్తులు, పాతరాజంపేట మైనార్టీ సంఘం సభ్యులు, ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు, లింగాపూర్‌ యువజన సంఘం సభ్యులు, పట్టణ బిజెవైఎం నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు సీనియర్‌ న్యాయవాది రమేశ్‌ చంద్‌, కౌన్సిలర్‌ అంజద్‌తోపాటు పలువురు ...

Read More »

కెసిఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టండి

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కామారెడ్డి శాసనసభ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆయన శుక్రవారం బిక్కనూరు మండలం జంగంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో కట్టించిన ఇళ్ళు తప్ప రెండు పడక గదుల ఇళ్ళు ఎక్కడున్నాయో తెరాస నేతలు చూపాలని నిలదీశారు. మూడంతస్తుల భవనాన్ని గంప గోవర్ధన్‌ నిర్మించుకొని పేదల రెండు పడక గదుల ఇళ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ...

Read More »

బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించండి

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం కోరారు. శుక్రవారం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాజన ప్రంట్‌ పునాదిగా ఏర్పడిన బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. రైతు నాగలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. నూటికి 90 శాతం ఉన్న బహుజనులు ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాజు, ...

Read More »

అసెంబ్లీలో మాట్లాడలేనోళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు

  కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీలో గళమెత్తని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శాసనమండలిలో గళమెత్తని విపక్షనేత షబ్బీర్‌ అలీ అభివృద్ది ఏం చేస్తారని కామరెడ్డి బిజెపి శాసనసభ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన దేవునిపల్లి, మద్దికుంట, భవానీపేట్‌, ముత్యంపేట్‌, బీబీపేట్‌, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, జనగామతో పాటు కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యే అయి ఏం లాభం, గంప గోవర్ధన్‌ ఒక్కసారైనా తన అసెంబ్లీ ...

Read More »

వర్ని మండలంలో పోచారం ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం వర్ని మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పాత వర్ని, రాజీపేట, ఫారం, శ్రీనగర్‌, శంకోర తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది, రైతు సంక్షేమం తెరాసతో సాధ్యమని మంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి సాగుపెట్టుబడి రైతులకు జీవితబీమా సౌకర్యం కల్పించిందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ది, ...

Read More »