Breaking News

అభ్యర్థులు ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి

 

కామారెడ్డి, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు అభిషేక్‌ కృస్ణ సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి సందేహాలున్నా ఉదయం 11 నుంచి 1 గంట వరకు పరిశీలకులను సంప్రదించాలని, వాట్సాప్‌, ఫోన్‌ నెంబరు ద్వారా సైతం సంప్రదించవచ్చని చెప్పారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల రెండవ ర్యాండమైజేషన్‌లో రాజకీయ పార్టీల ప్రతినిదులు పాల్గొనాలని కోరారు. ఎటువంటి మత, కుల సంబంధిత విద్వేషాలకు ప్రచారంలో చోటివ్వద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంబంధిత ప్రదేశాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టకూడదని ఆదేశించారు. అభ్యర్థుల ఖర్చును జిల్లా బృందం నిరంతరం సమీక్షిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *