Breaking News

అసెంబ్లీలో మాట్లాడలేనోళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు

 

కామరెడ్డి, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీలో గళమెత్తని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శాసనమండలిలో గళమెత్తని విపక్షనేత షబ్బీర్‌ అలీ అభివృద్ది ఏం చేస్తారని కామరెడ్డి బిజెపి శాసనసభ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన దేవునిపల్లి, మద్దికుంట, భవానీపేట్‌, ముత్యంపేట్‌, బీబీపేట్‌, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, జనగామతో పాటు కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యే అయి ఏం లాభం, గంప గోవర్ధన్‌ ఒక్కసారైనా తన అసెంబ్లీ నియోజకవర్గం గురించి శాసనసభలో మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఏళ్ళుగా కాంగ్రెస్‌, టిడిపి, తెరాసలు నియోజకవర్గాన్ని పరిపాలించినా ఏం అభివృద్ది వెలగబెట్టారని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, పూరి గుడిసెలు, 30 స్పీడుతో బండి నడపలేని అంతర్గత రోడ్లు, సమస్యలు దర్శనమిస్తున్నాయని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్య, ఉపాది కల్పనలో పాలకులు చొరవ చూపలేదని, అందుకే యువత గల్ప్‌ బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసి అభివృద్ది చేసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.

Check Also

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *