Breaking News

కెసిఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టండి

 

కామరెడ్డి, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కామారెడ్డి శాసనసభ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆయన శుక్రవారం బిక్కనూరు మండలం జంగంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో కట్టించిన ఇళ్ళు తప్ప రెండు పడక గదుల ఇళ్ళు ఎక్కడున్నాయో తెరాస నేతలు చూపాలని నిలదీశారు. మూడంతస్తుల భవనాన్ని గంప గోవర్ధన్‌ నిర్మించుకొని పేదల రెండు పడక గదుల ఇళ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్‌ అతని కుటుంబ పాలనగా మలుచుకున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు రెట్టింపు చేస్తామని తదితర హామీలు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఎరుకల సంఘం నాయకులు పార్టీలో చేరి షబ్బీర్‌కు మద్దతు తెలిపారు.

Check Also

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *