Breaking News

బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించండి

 

కామరెడ్డి, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం కోరారు. శుక్రవారం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాజన ప్రంట్‌ పునాదిగా ఏర్పడిన బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. రైతు నాగలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. నూటికి 90 శాతం ఉన్న బహుజనులు ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాజు, జబ్బర్‌ నాయక్‌, సాయిరెడ్డి, సత్యం, బాలయ్య, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం కల్లా కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23న పార్లమెంటు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *