Breaking News

వర్ని మండలంలో పోచారం ప్రచారం

 

బాన్సువాడ, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం వర్ని మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పాత వర్ని, రాజీపేట, ఫారం, శ్రీనగర్‌, శంకోర తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది, రైతు సంక్షేమం తెరాసతో సాధ్యమని మంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి సాగుపెట్టుబడి రైతులకు జీవితబీమా సౌకర్యం కల్పించిందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ది, సంక్షేమ పథకాలు తక్కువ కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపిందని పేర్కొన్నారు. పథకాలు విజయవంతంగా కొనసాగాలంటే ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రజలు అధికార పార్టీ వెంట ఉన్నారని స్పష్టమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *