Breaking News

గుబాలిస్తున్న గులాబీ

 

రెంజల్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెరాస మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు. మండలంలోని కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శుక్రవారం తెరాస పార్టీ ఆద్వర్యంలో బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న షకీల్‌ అన్నను గెలిపించి బోధన్‌లో మళ్ళీ గులాబి జెండా గుబాలించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌, మౌలానా, కాశం సాయిలు, జలయ్య, సాయిబాబా, సాయిలు, శ్రీనివాస్‌, గంగాధర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *