Breaking News

సిఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

బాన్సువాడ, నవంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈనెల 28న జరగనున్న ఆపద్దర్మ ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. స్థానిక నాయకులు, పోలీసు అధికారులతో కలిసి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి బజార్‌ ప్రాంతంలో సభాస్థలిని పరిశీలించి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 28న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం వినడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగ ఉన్నారని పేర్కొన్నారు. 60 వేల పైచిలుకు ప్రజలు సబకు తరలివస్తారని అంచనా వేశారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని గుర్తించినట్టు తెలిపారు. మహిళలు, వృద్దులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు వరుసలో స్థలం కేటాయించినట్టు పోచారం తెలిపారు. సిఎం ప్రసంగం వినడానికి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అన్నారు. ఆయన వెంట స్థానిక అధికారులతో పాటు జిల్లా రైతు సమన్వయ సమితి అద్యక్షుడు అంజిరెడ్డి, పోచారం భాస్కర్‌రెడ్డి నాయకులు గంగాధర్‌, ఎజాజ్‌, తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *