Breaking News

నసురుల్లాబాద్‌ మండలంలో మంత్రి ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తలెత్తుకొని తిరిగేలా తెరాస ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని బాన్సువాడ తెరాస అబ్యర్తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నసురుల్లాబాద్‌ మండలంలోని నసురుల్లాబాద్‌, మైలారం, లింగంపల్లి తాండా, ఫకీర్‌ నాయక్‌ తండా, బొప్పాస్‌పల్లి, బీర్కూర్‌, తిమ్మాపూర్‌ తాండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతుల క్షేమం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని, దీంతోపాటు రైతులకు రైతుబీమా పథకం కల్పించిందని వెల్లడించారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి తెరాస పార్టీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని, రైతుల్ని విస్మరించారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి కుటుంబాలను ఆదుకున్నట్టు పేర్కొన్నారు. బాన్సువాడలో ఈనెల 28న జరిగే ప్రజా ఆశీర్వాదసభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కల్లబొల్లి మాటలతో కూటమి పార్టీ ప్రజలను మోసపూరితం చేస్తుందని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *