Breaking News

Daily Archives: November 27, 2018

పదవిలో ఉన్నపుడు చేతకానిది పదవి పోగానే గుర్తొచ్చాయా

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవిలో ఉన్నపుడు ప్రజలను పట్టించుకోని ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు పదవి పోగానే ఎన్నికల సమయంలో కామారెడ్డి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందని, కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళవారం కామారెడ్డి మండలం టేక్రియాల్‌తోపాటు పట్టణంలోని వివిధ కూడళ్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలుమార్లు ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన గంప గోవర్ధన్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస ...

Read More »

విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ను మెరుగుపరచాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 2018-19 విద్యాసంవత్సరంలో బిసిలు అర్హత గల విద్యార్థులు 10,051 ఉన్నప్పటికి 7672 మంది విద్యార్థులు, ఈబిసిలు అర్హతగల విద్యార్థులు 620 మంది ఉన్నప్పటికి 478 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ మెరుగుపరచాలని జిల్లా వెనకబడిన తరగతుల అధికారిణి ఝాన్సీరాణి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రబుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, జూనియర్‌, డిగ్రీ, పిజి, బిఇడి, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌తో మంగళవారం సమావేశం నిర్వహించారు. 2013-14 విద్యాసంవత్సరం ...

Read More »

ఆరోగ్య కార్యక్రమాల అంశాలపై సమీక్ష

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై మంగళవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్‌ డాక్టర్‌ యోగితారాణా ఐఏఎస్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఆర్‌బిఎస్‌కె, టివి కార్యక్రమాల అమలు అంశాలపై ఆరాతీశారు. కామారెడ్డి జిల్లాలో అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షల సందర్భంగా గుర్తించబడిన రుగ్మతగల విద్యార్థులకు, అంగన్‌వాడిల్లో గుర్తించిన వారికి డిసెంబరు 31 నాటికి పూర్తి చికిత్స అందిస్తామని ...

Read More »

చురుకుగా సాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 7న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబందించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఎన్నికలు, కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్‌ రిజర్వుగా ఉన్నవాటిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో 269 బ్యాలెట్‌ యూనిట్లను మేడ్చల్‌ జిల్లాకు తరలించారు. కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ...

Read More »

అభివృద్ది చేశాం – ఆదరించండి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని చూసి తిరిగి తనకు ఓటు వేసి ఆదరించాలని కామారెడ్డి అసెంబ్లీ తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌ కోరారు. మంగళవారం ఆయన రాజంపేట, భిక్కనూరు, జంగంపల్లి, పెద్దాయపల్లి, అన్సాన్‌పల్లి, లక్ష్మిదేవునిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ తెరాస అధినేత కెసిఆర్‌ ఆద్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించుకోవడమే గాకుండా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునే క్రమంలో ముందకు సాగుతున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ...

Read More »

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ నియోజకవర్గ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని 1,2,3,4,5వ వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో పదేళ్ల నుంచి అభివృద్ది కుంటుపడిందని, రోడ్లు, మురికి కాలువలు లేక ప్రతి వాడ మురికి వాడగా మారిందని అన్నారు. ప్రజలు ఇళ్లులేక అద్దె ఇళ్లల్లో ఉంటూ అద్దెకట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. గంప గోవర్ధన్‌ ఏనాడైనా పట్టణంలోని వార్డుల్లో పర్యటించారా ...

Read More »

మహేశ్‌ బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ తెరాస అభ్యర్తి బిగాల గణేశ్‌గుప్తకు మద్దతుగా తన సోదరుడు ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 23వ డివిజన్‌ సీతారాంనగర్‌ కాలని హనుమాన్‌ మందిరం నుంచి అరుణ్‌ నగర్‌, బాపన్‌ గల్లి, సాయినగర్‌, సంతోష్‌ నగర్‌లలో నగర మేయర్‌ ఆకుల సుజాతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కెసిఆర్‌ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల ...

Read More »

తెలంగాణకి బిజెపి ప్రత్యామ్నాయం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇప్పటి వరకు తాను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నానని, ఈరోజు ఐదవరాష్ట్రం ఎక్కడచూసినా ఇదే ఉత్సాహం కనిపిస్తోందని, కెసిఆర్‌, ఆయన కుటుంబం అభివృద్ది చేయాల్సిన అవసరంలేదు… కాంగ్రెస్‌ ఏవిధంగా ఉందో అలాగే అధికారం చలాయించిందో అలాగే ఉండాలని అనుకుంటుంది… కానీ రోజులు మారాయి అని దేశ ప్రధాని నరేంద్రమోడి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కెసిఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ నిజామాబాద్‌ను లండన్‌ ...

Read More »