Breaking News

ప్రచారంలో దూసుకుపోతున్న ఆకుల లలిత

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత ప్రచారంలో దూసుకెళుతున్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మాపూర్‌, వెల్మల్‌, గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. వెల్మల్‌ గ్రామంలో వందమంది యువకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మాదాపూర్‌, ధర్మోరా, కొత్తపల్లి, గుంజిలి, చిక్లి గ్రామాల్లో పర్యటించి పలువురిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఆర్మూర్‌ నియోజకవర్గంలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల సమ్మెకు తెలంగాణ ఐకెపి వివోఏ సంఘం మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *