Breaking News

ఈవిఎం, వీవీప్యాట్‌లపై సిబ్బందికి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నేపథ్యంలో భాగంగా డిసెంబరు 7న పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన పనులపై, ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి 300 మంది ప్రిసైడింగ్‌ అదికారులకు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు రెండోవిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబరు 6న ఉదయం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వరకు, తిరిగి డిసెంబరు 7న పోలింగ్‌ అనంతరం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ సిబ్బందికి ఉచిత రవాణా, పోలింగ్‌ కేంద్రాల్లో భోజన, అల్పాహార వసతి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాక్‌ పోల్‌ సందర్భంలోనే సిబ్బంది సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్‌శాతం తెలియజేయాలని సూచించారు. ఈవిఎం, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించారు. అనంతరం దివ్యాంగ ఓటర్లతో ప్రవర్తన విధానంపై రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపివో శ్రీనివాస్‌, ఐసిడిఎస్‌ అధికారిణి రాధమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *