Breaking News

కామారెడ్డిలో జ్యోతిబాఫూలే వర్ధంతి

కామారెడ్డి, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన ఐక్యవేదిక, ఎంసిపిఐయు పార్టీ ఆద్వర్యంలో కామారెడ్డిలో బుదవారం జ్యోతిబాఫూలే 128వ వర్ధంతి నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట గల ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా కన్వీనర్‌ సిద్దిరాములు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం అణగారిన వర్గాల కోసం బహుజన సమాజ శ్రేయస్సు కోసం ఫూలే చేసిన త్యాగాలు, కృషి ఎనలేనివన్నారు. జ్యోతిబాఫూలే సావిత్రిబాయి ఫూలే, అంబేడ్కర్‌ ఆశయాల సాదనకు బహుజన సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు విజయ్‌, రాజలింగం, నాగరాజు, తిరుపతి, రాజు, జబ్బర్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *