Breaking News

మ్యాక్సు క్యూర్‌ నిహారిక ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మ్యాక్సు క్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆద్వర్యంలో మాక్లూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో గ్రామస్తులకు బిపి, ఇసిజి, షుగర్‌ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేశారు. ఇందులో మొత్తం 200లకు పైగా గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ ఝాన్సీ మాట్లాడుతూ బిపి, షుగర్‌ వ్యాదుల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగిందని, మనిషికి శారీరక వ్యాయామం ఉండాలని, రోజు కనీసం గంటపాటు నడక మంచిదని పేర్కొన్నారు. అదేవిధంగా మ్యాక్సు క్యూర్‌ ఆద్వర్యంలో గ్రామ గ్రామానికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇందులో ఆసుపత్రి మేనేజర్‌ సురేశ్‌బాబు, కో ఆర్డినేటర్‌ శివ, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *