Breaking News

అర్బన్‌లో బిగాల జోరుగా ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త బుధవారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. నగరంలో 22వ డివిజన్‌లోని పెద్దబజార్‌, పోతలింగయ్య మందిరం నుంచి శివాజీనగర్‌, అప్నాబజార్‌, సీతారాంనగర్‌ కాలనీ, రేడియో స్టేషన్‌ వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుప్త మాట్లాడుతూ కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయని, దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కుతుందని అన్నారు. తనను తిరిగి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, కార్పొరేటర్‌లు కనకం సుధ, సదానంద్‌, కొవూరి జగన్‌, న్యాలం కిషన్‌, సత్యప్రకాశ్‌, సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌, లింగంపల్లి పృథ్వీరాజ్‌, శ్రీధర్‌ గుప్త, నర్సింహ, అంబటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *