Breaking News

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు శాంతియుతంగా జరపడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సూచించారు. బుధవారం ప్రగతిభవన్‌లో పోలీస్‌, సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో పాటు ఆయా పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన పక్షంలో ఉపేక్షించేది లేదని జిల్లా యంత్రాంగం ద్వారా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం సందర్భంగా పార్టీల ప్రతినిధులు ఒక్కొక్కరు వేరువేరుగా వస్తున్నందున ఇక్కడ చర్చించిన అంశాలను మిగతా తమ ప్రతినిదులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం దివ్యాంగుల వివరాలు సిద్దంగా ఉన్నాయని, ఎన్నికల ఫిర్యాదులపై ఎన్నికల కమీషన్‌ ఏర్పాటు చేసిన 1950 టోల్‌ఫ్రీనెంబరుకు గాని, జిల్లా కేంద్రంలో 1800 625 6644 నెంబర్లకు లేదా 08462-224001 ఏర్పాటు చేసినట్టు వివరించారు.

నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ పబ్లిక్‌ సమావేశాలకు, ర్యాలీలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని, సమావేశాలకు, ర్యాలీలకు ఎంత మంది వస్తున్నారో తెలపాలని, అనుమతి తీసుకున్నవారికంటే ఎక్కువ వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎందుకంటే అనుమతి సందర్భంగా సూచించిన సంఖ్యకే బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. సమాచారం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.

కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు సుఖ్‌బీర్‌సింగ్‌, డిఆర్వో అంజయ్య, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *